- Telugu News Photo Gallery If you do this on Diwali, all the negative energy in the house will disappear, Check Here is Details
Vastu Tips: దీపావళి రోజున ఇలా చేశారంటే.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది..
కొన్ని కొన్ని వాస్తు నియమాలు పాటించడం వల్ల కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ దీపావళికి మీ ఇంటిని ఎంతో సుందరంగా అలంకరించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.
Updated on: Oct 30, 2024 | 12:56 PM

దీపావళి అంటే అందరికీ ఇష్టమైన పండుగ. దీపావళి అంటే రంగు రంగుల పండుగ అని కూడా అంటారు. సంతోషంగా మిఠాయిలు పంచి పెడుతూ ఆనందాన్ని పంచి పెడుతూ ఉంటారు. దీపావళి రోజున లక్ష్మీ దేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాగే ఇప్పుడు చెప్పే పనులు చేయడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.

ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలాంటి పనులు ముందుకు వెళ్లవు. ఏ పనులు సాగవు. ఇంట్లో ఎప్పుడూ సమస్యలు, గొడవలతో సతమతమవుతూ ఉంటారు. కాబట్టి దీపావళి రోజు ఇప్పుడు చెప్పే వాస్తు నియమాలు పాటిస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెబుతున్నారు.

దివాళి పండుగ రోజున కేవలం రాత్రికే కాకుండా ఉదయం కూడా పూజ చేసుకోవడం మంచిది. ఉదయం, సాయంత్రం.. రెండు పూటలా కూడా కర్పూరం వెలిగించాలి. కర్పూరం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి.

సాధారణ దీపాల కంటే మట్టి దీపాలు వెలిగించడం వల్ల మంచి శుభసూచికం. అదే విధంగా నీటిలో రాళ్ల ఉప్పు, పసుపు కలిపి.. ఇంటిని తుడవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.

దీపావళి రోజు పెయింటింగ్ ముగ్గులు ఉన్నా.. ముగ్గుతో ముగ్గులు వేయాలి. అదే విధంగా గుమ్మాన్ని కూడా ఎంతో భక్తితో పూజించాలి. ఇంటిని మామిడి ఆకులు, పువ్వులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)



















