Onions Chopping Tips: కన్నీళ్లు రాకుండా ఉల్లిని ఎలా కట్‌ చేయాలో తెలుసా?

Updated on: Sep 18, 2025 | 8:10 PM

ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్లు కారడం సహజం. ఉల్లి ఆహార రుచిని పెంచుతాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ వంట చేసే వారికి ఇది అలవాటు అయినప్పటికీ, ఉల్లిపాయలు కోసేటప్పుడు ప్రతిసారి కళ్ళ నుంచి నీరు కారుతుంటాయి..

1 / 5
ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్లు కారడం సహజం. ఉల్లి ఆహార రుచిని పెంచుతాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ వంట చేసే వారికి ఇది అలవాటు అయినప్పటికీ, ఉల్లిపాయలు కోసేటప్పుడు ప్రతిసారి కళ్ళ నుంచి నీరు కారుతుంటాయి.

2 / 5
కానీ దీనికి ఒక పరిష్కారం ఉంది. మీరు ఈ చిన్న ట్రిక్‌ పాటిస్తే మీ కళ్ల నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాదు. ఉల్లిపాయలు కోసే ముందు కొన్ని సాధారణ చిట్కాలు పాటిస్తే వీటి వల్ల కళ్లు మండటం నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు అంటున్నారు.

3 / 5
ముందుగా ఉల్లిపాయలు కోసే ముందు, వాటి తొక్క తీసి నీటిలో 5 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత దాదాపు 10 నిమిషాలపాటు రిఫ్రిజిరేటర్‌లో చల్లబరచాలి. ఇలా చేయడం వల్ల ఉల్లి కోసేటప్పుడు కళ్లు మండకుండా ఉంటాయి.

4 / 5
ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఉల్లిపాయలను కోసినప్పుడు ఈ సమ్మేళనాలు గాలితో కలిసి వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఈ సమ్మేళనాలు కళ్ళకు తాకినప్పుడు, అవి కళ్ళలో మంటలను పుట్టించే అనుభూతిని కలిగిస్తాయి.

5 / 5
దీని వలన కన్నీళ్లు వస్తాయి. కానీ ఉల్లిపాయను తొక్క తీసి నీటిలో వేయడం వల్ల ఈ అనుభూతి తగ్గుతుంది. కాబట్టి ఉల్లిపాయను కోసే ముందు నీటిలో నానబెట్టండి. వంట చేసే ముందు వాటిని ఫ్రిజ్‌లో ఉంచి ఆపై కట్ చేస్తే కళ్ళకు హాని కలిగించదు.