క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కాదు కదా మెతుకు కూడా వదలరు!

Updated on: Feb 11, 2026 | 10:01 PM

క్యాబేజీ చికెన్ కర్రీ వినడానికి కొత్తగా ఉన్నా ఒక్కసారి ఈ రెండింటిని కలిపి వండితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా ఎప్పుడూ మీరు తిని ఉండరు, కానీ ఒకసారి ట్రై చేయండి. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
 కావాల్సిన పదార్థాలు : పావు కిలో చికెన్,  క్యాబేజీ,  ఉల్లిపాయలు, ఒక టేబుల్  స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం,  అర టీ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా,   2 టేబుల్ స్పూన్స్ నూనె,  రుచికి సరి పడినంత ఉప్పు తీసుకోవాలి

2 / 5
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి అది వేడయ్యాక  వేయండి  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు  వేయించండి.

3 / 5
ఇక ఇప్పుడు  అల్లం-వెల్లుల్లి పేస్ట్ తీసుకుని దానిలో  వేసి బాగా వేయించి చికెన్ ముక్కలను వేయండి. 5 నిమిషాలు తర్వాత పసుపు, ఉప్పు వేసి  బాగా ఉడికించండి.

4 / 5
చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత   క్యాబేజీని వేసి  బాగా కలపండి. అలాగే పొయ్యి మీదే 10 నిముషాలు ఉంచి బాగా  మగ్గనివ్వండి.

5 / 5

కారం,  మసాలా పొడులు  వేసి బాగా కలుపుకోండి.  గ్రేవీ తినాలనుకునే వారు ఒక గ్లాస్ నీళ్ళు పోసి 10 నిముషాలు అలాగే ఉంచండి. క్యాబేజీ, చికెన్ ఉడికిన తర్వాత దించే ముందు  కొత్తిమీర వేసి కిందకు దించేయండి. అంతే, వేడి వేడి చికెన్, క్యాబేజి కర్రీ రెడీ.