Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naturally Ripen Mangoes: మీరూ మామిడి పండ్లు కొంటున్నారా? సహజంగా పండాయో లేదో ఇలా గుర్తించండి..

వేసవి వచ్చేసింది. మార్కెట్లో ఎక్కడ చూసినా రకరకాల మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే మామిడి పండ్లు సహజంగా పండించినవే తినాలి. కొంత మంది వ్యాపారులు అధిక లాభాలకు కక్కుర్తిపడి అవి పంటకు రాకుండానే రసాయనాలు చల్లి కృత్రిమంగా పండిస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి హానికరం..

Srilakshmi C

|

Updated on: Mar 16, 2025 | 8:36 PM

వేసవిలో వచ్చే మామిడి పండ్లు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. కానీ మనం తినే మామిడి పండ్లు సహజంగా పండించినవా? లేక రసాయనాలు చల్లారా? అనే విషయం తప్పక తెలుసుకోవాలి. మార్కెట్లో లభించే చాలా పండ్లు రసాయనాల ద్వారా పండిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరం.సహజంగా పండిన మామిడిని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
సహజంగా పండిన మామిడికాయలు కొంచెం గట్టిగా ఉంటాయి. మీరు దానిని కొద్దిగా నొక్కితే అవి గట్టిగా ఉంటాయి. కానీ రసాయనాలతో పండించిన పండ్లు మృదువుగా, అధికంగా మెత్తగా ఉంటాయి. ఇది రసాయనాల వల్ల కలిగే ప్రభావం.

2 / 5
సహజంగా పండిన మామిడి పండ్లపై చిన్న గీతలు, స్వల్ప మచ్చలు ఉంటాయి. కానీ అవి ప్రమాదకరమైనవి కావు. కానీ రసాయనాలతో పండించిన పండ్లపై అకస్మాత్తుగా మచ్చలు ఏర్పడటం మీరు గమనించవచ్చు. ఇవి అసహజంగా కనిపిస్తాయి. సహజంగా పండిన మామిడి పండ్లు వివిధ రంగులలో కనిపిస్తాయి. కొన్ని చోట్ల అవి పసుపు రంగులో ఉంటాయి,. కొన్ని చోట్ల అవి ముదురు నారింజ రంగులో ఉంటాయి. కానీ రసాయనాలతో పండించిన పండ్లు పూర్తిగా ఏకరీతి రంగుతో ప్రకాశిస్తాయి. అవి అసహజంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు ఈ వ్యత్యాసాన్ని గుర్తుంచుకోవాలి.

3 / 5
పండిన మామిడి పండ్లు సహజంగా తీపి రుచిని కలిగి ఉంటాయి. కానీ రసాయనాలతో పండిన మామిడి పండ్లు కొద్దిగా అసహజ వాసన కలిగి ఉంటాయి. కొన్ని సార్లు వాసన కూడా ఉండవు. కాబట్టి మామిడి పండ్లను కొనేటప్పుడు దాని వాసనపై శ్రద్ధ పెట్టండి. అలాగే ఒక గిన్నెలో నీళ్లు నింపి దానిలో మామిడికాయలు వేయాలి. సహజంగా పండించిన పండ్లు నీటిలో మునిగిపోతాయి. కృత్రిమంగా పండించిన పండ్లు నీటిపై తేలుతాయి. ఇది సులభమైన పద్ధతి.

4 / 5
మరోపద్ధతి ఒక గిన్నెలో నీళ్లు నింపి, కొంచెం బేకింగ్ సోడా వేసి అందులో మామిడికాయను ఒక నిమిషంపాటు ఉంచాలి. తరువాత మామిడికాయలను శుభ్రంగా కడగాలి. అవి రంగు మారితే మామిడిని రసాయనాలతో పండించారని అర్థం.

5 / 5
Follow us