Chinni Enni |
Updated on: Nov 15, 2024 | 6:54 PM
అనారోగ్య సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మనం నిత్యం ఉపయోగించే వస్తువుల ద్వారా కూడా రోగలు ఎటాక్ చేయవచ్చు. వీటితో ఏముందిలే అనుకుంటారు. ప్రతి రోజూ మనం నిద్రించే బెడ్ కారణంగా కూడా రోగాలు రావచ్చు.
ముఖ్యంగా తలదిండ్లతో ఎక్కువగా ఎఫెక్ట్ పడే అకాశం ఉంటుంది. తల మీద ఉండే మురికి అంతా తల దిండ్ల మీదనే ఉంటుంది. వీటిపై బ్యాక్టీరియా, వైరస్‌లు మిలియన్ల కొద్దీ ఉంటాయి. బెడ్ షీట్లు, పిల్లో కవర్స్ అనేవి రెగ్యులర్‌గా మార్చుతూ ఉండాలి.
బెడ్ మీద పడుకుంటాం కాబట్టి.. ఈ వైరస్, బ్యాక్టీరియా త్వరగా ఎటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటి కారణంగా చర్మ సంబంధిత సమస్యలు, అలెర్జీలు కూడా వస్తాయి. టాయిలెట్ కంటే వంద రెట్ల క్రిములు ఎక్కువగా తలదిండ్లు, బెడ్ షీట్లపైనే ఉంటాయట.
పిల్లో కవర్స్ ఉతికితే సరిపోదు. తలదిండ్లను కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. వీటిని వారంలో ఒకసారి ఎండలో పెడతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల క్రిములు, బ్యాక్టీరియా నశిస్తాయి. కనీసం పది రోజులకు ఒకసారి అయినా బెడ్ కవర్స్, పిల్లో కవర్స్ మార్చుతూ ఉండాలి.
వీటిని వేడి నీటిలో బేకింగ్ సోడా వేసి ఉతికి.. ఎండలో ఆరేస్తే త్వరగా క్రిములు పోతాయి. దుర్వాసన వచ్చేంత వరకు ఉంచకుండా.. త్వరగా పిల్లో కవర్స్ మార్చుతూ ఉండాలి. రోజులు గడిచే కొద్దీ బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది.