Terrace Gardening: భాగ్యనగర వాసులూ మీ కూరగాయలు మీరే పండించుకొండిలా.. ఇక్కడ టెర్రస్ గార్డెన్ పై ఫ్రీ ట్రైనింగ్

| Edited By: Surya Kala

Nov 23, 2024 | 4:44 PM

టెర్రస్ గార్డెనింగ్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఒకప్పుడు పల్లెటూర్లలో ఇంటి పెరట్లో లేదంటే ఇంటి చుట్టూ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కలను, పువ్వుల చెట్లను కూరగాయల చెట్లను పెంచుకునే వారు. ఇంటికి కావలసిన కూరగాయలు, సీజనల్ పండ్లను పండించుకునేవాళ్ళం. అయితే పల్లెల్లు.. నగరాల బాట పట్టాయి. పట్టణీకరణ తో అందరూ కూడా నగరాలకు తరలిరావడం నగరాలన్నీ పూర్తిగా కాంక్రీట్ జంగల్ గా మారిపోవడం చక చక జరిగిపోయింది.

1 / 7
పెరుగుతున్న జనాభాకు సరిపడా కూరగాయలను తాజాగా అందించటానికి రకరకాల కెమికల్స్ ని వాడి మనకు అమ్ముతున్నారు. ఆ కలుషితమైన కెమికల్ కూరగాయల్ని మనము తిని అనారోగ్యం పాలవుతున్నాం. ఆకుకూరలు వాడిపోకుండా తాజాగా కనపడటానికి కెమికల్స్ స్ప్రే, బఠానీలు ఆకుపచ్చగా కనబడటానికి కలర్, వాటర్ మీలోన్ ఎర్రగా, టేస్టీ ఉండడటానికి కలర్ ఇంజెక్షన్ ఇలా ఒకటేమిటి ప్రతీది కల్తీ. స్వచ్ఛమైనవి కొనటానికి అవకాశం లేదు పోనీ సొంతంగా పండించుకుందామంటే మహానగరాల్లో ఇంట్లో స్థలం లేదు.

2 / 7
అందుకే టెర్రస్ గార్డెన్ అనే కల్చర్ ఈమధ్య చాలా ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు టెర్రస్ గార్డెన్ అంటే సంపన్నులు, పెద్దపెద్ద బంగళాలు ఉన్నవాళ్లు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు దీనిపై ప్రచారం బాగా పెరగటం దాంతోపాటు సులభం, తక్కువ ఖర్చు, మనకు కావలసిన కూరగాయలు మనమే సొంతంగా పండించుకోవడం, అన్నింటికీ మించి ఎటువంటి కల్తీ లేని కూరగాయలు తింటున్నామని తృప్తి వల్ల ఇప్పుడు ఇది చాలా విస్తృతంగా పెరిగింది.

3 / 7

అయితే చాలామందికి టెర్రస్ గార్డెన్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న దీన్ని ఎలా చేయాలో తెలియక పోవచ్చు. అలాంటి వారి కోసమే ఉద్యానవన శాఖ టెర్రస్ గార్డెన్ పై ఆసక్తి గల వారికి ఉచిత శిక్షణ ఇస్తోంది.

4 / 7
24 నవంబర్ ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మీ ఇంట్లో ఉన్న టెర్రస్ లేదా బాల్కనీలో కానీ సొంతంగా కూరగాయలు పండించుకునేందుకు శిక్షణ ఇస్తుంది ఉద్యానవని శాఖ. నాంపల్లి రెడ్ హిల్స్ లోనే ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు.

5 / 7
దీనికోసం నామమాత్ర రుసువుగా 100 రూపాయలను వసూలు చేస్తున్నారు. దీనిలో టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేయాలి. కూరగాయల మొక్కలను ఎలా పెంచాలి ఎటువంటి కూరగాయల మొక్కలైతే టెర్రస్ గార్డెన్ కి అనువుగా ఉంటాయి,  ఏలాంటి ఎరువులను వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా అన్నింటిలో శిక్షణ ఇస్తారు.

6 / 7
 
ఆసక్తి గలవారు 8977714411 లేదా 9849299807 నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు.

7 / 7
మరి ఎందుకు ఆలస్యం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వెంటనే ఇక్కడికి పెళ్లి మీ ఇంటికి సరిపడా కూరగాయలు మీరు ఎలా పండించుకోవాలో నేర్చుకోండి.