5 / 5
శీతాకాలంలో జుట్టుకు డీప్ కండిషనింగ్ అవసరం. డీప్ కండిషనింగ్ ద్వారా జుట్టుకు అదనపు తేమ అందుతుంది. అందుకు నెయ్యి వేడి చేసి జుట్టుకు రాసుకోవాలి. ఇది సహజ పద్ధతిలో జుట్టును కండిషన్ చేస్తుంది. అలాగే తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నెయ్యి తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఈ సహజ పదార్ధం మీ జుట్టును మందంగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. నెయ్యిలో ఉండే ముఖ్యమైన పోషకాలు ఒక నెలలోనే జుట్టు అంగుళం పెరిగేలా చేస్తాయి.