పెరుగును సూపర్ ఫుడ్ అని అంటారు. పెరుగు రోజూ తినడం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. దీన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టుకు సంబంధించి సగం సమస్యలు తీరిపోతాయి. చుండ్రు, జుట్టు రాలడం, చివర్లు చిట్లిపోవడం, పొడి జుట్టు వంటి జుట్టు సమస్యల నివారణకు పెరుగు మాత్రమే చక్కని పరిషారం ఇవ్వగలదు. పెరుగును జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. పుల్లటి పెరుగు జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. ఈ పదార్ధం కఠినమైన మరియు పొడి జుట్టుకు తాజాదనాన్ని పునరుద్ధరిస్తుంది. పుల్లటి పెరుగు స్కాల్ప్ సమస్యలను కూడా దూరం చేస్తుంది.