Hepatitis: మీకు తరచూ ఆకలి లేకపోవడం, అలసట, కడుపునొప్పిగా అనిపిస్తుందా? వెంటనే డాక్టర్‌ను కలవండి

|

Oct 28, 2024 | 1:25 PM

కలుషిత ఆహారం, నీరు ద్వారా సంభవించే ప్రమాదకర వ్యాధి హెపటైటీస్. ఇదొక అంటు వ్యాధి. అంటే ఒకరికి వచ్చిందంటే మిగతా వారికి కూడా వేగంగా వ్యాపిస్తుందన్నమాట. ఈ వ్యాధి గురించిన సరైన అవగాహన లేకపోవడం వల్ల అధికమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..

1 / 5
హెపటైటిస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇది అంటు వ్యాధి. ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశం కూడా ఆందోళనకరమైన స్థితిలో ఈ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి రోజు సుమారు 3500 మంది ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారు. హెపటైటిస్ వైరస్ మానవ కాలేయంపై దాడి చేస్తుంది. అందులో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కారణంగా మరణించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అధిక మందికి హెపటైటిస్ బి సోకి మరణాల బారీన పడుతున్నారు.

2 / 5
 హెపటైటిస్ ఉన్నవారిలో 83 శాతం మందికి హెపటైటిస్ బి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. హెపటైటిస్ కారణంగా మరణించిన వారిలో 17 శాతం మందికి హెపటైటిస్ సి సోకుతుంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణం కొన్ని సందర్భాల్లో మాత్రమే సంభవిస్తుంది.

3 / 5
దీనికి చికిత్స చేయవచ్చు. ఈ రెండు వ్యాధులకు కూడా మార్కెట్‌లో సరిపడా మందులు ఉన్నాయి. హెపటైటిస్ ఒక అంటు వ్యాధి. మితిమీరిన ఆల్కహాల్, ధూమపానం, కొన్ని సందర్భాల్లో కొన్ని మందుల వినియోగం, అదనపు జంక్ ఫుడ్ తినడం ఈ వ్యాధికి దారితీస్తుంది.

4 / 5
ప్రధానంగా A, B, C, E ఈ 4 రకాల హెపటైటిస్‌లు ఆరోగ్యంపై దాడి చేస్తాయి. హెపటైటిస్ ఎ కలుషిత ఆహారం లేదా నీరు తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది. హెపటైటిస్ బి శరీర ద్రవాలు, రక్తం, వీర్యం, యోని స్రావాల ద్వారా సంక్రమిస్తుంది. అయితే హెపటైటిస్ - HIV ఒకే వ్యాధి కాదు.

5 / 5
హెపటైటిస్ సి రక్తం ద్వారా వ్యాపిస్తుంది. హెపటైటిస్ డి ఇన్ఫెక్షన్ అంటు వ్యాధి. హెపటైటిస్ ఇ కలుషిత నీటి వల్ల వస్తుంది. అలసట, ముదురు రంగు మూత్రం, కడుపునొప్పి, మలం పాలిపోవడం, తినడానికి ఇష్టపడకపోవడం, చర్మం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. ఇవి హెపటైటిస్ ప్రారంభ లక్షణాలు.