AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెసర్లతో రుచికరమైన వంటకాలు.. పుష్కలమైన ఆరోగ్యం.. పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు!

ఆరోగ్యకరమైన ఆహారం అనగానే చాలామందికి చప్పగా ఉండే వంటకాలు గుర్తొస్తాయి. కానీ, పెసర్ల (Green Moong Dal) విషయంలో అది తప్పు. పెసర్లతో అద్భుతమైన రుచితో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు పొందే వీలుంది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు పెసరపప్పు ఒక వరం లాంటిది. పెసరపప్పులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. నానబెట్టిన, మొలకెత్తిన పెసర్లతో ఎన్ని రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చునో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: May 05, 2026 | 8:10 AM

Share
మొలకెత్తిన పెసర్ల సలాడ్: ఇలా నానబెట్టిన పెసర్లతో కమ్మటి సలాడ్‌, చాట్‌ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా సులభం, రుచికరంగా ఉంటుంది. పెసర్లను మొలకెత్తించి, అందులో ఉల్లిపాయ, టమోటా, నిమ్మరసం, చాట్ మసాలా కలిపి స్నాక్స్‌లా తీసుకోవచ్చు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి, జిమ్ చేసే వారికి మంచి ప్రోటీన్ డైట్.

1 / 6
పెసరట్టు (Moong Dal Chilla): పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌లో దోశలకు బదులుగా పెసరట్టు వేసి ఇవ్వండి. పెసరపప్పును నానబెట్టి, అల్లం, పచ్చిమిర్చితో కలిపి రుబ్బి దోశల్లా వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పన్నీర్ లేదా కూరగాయల తురుము కలిపితే మరింత పోషకాలు అందుతాయి. పచ్చి పెసలను బియ్యం, బొంబాయి రవ్వతో పాటు రాత్రంతా నానబెట్టుకుని, ఉదయాన్నే వాటిని మెత్తగా రుబ్బుకుని దోసెలు వేసుకోవచ్చు.. ఇవి చాలా రుచిగా ఉంటాయి.

2 / 6
హెల్తీ మూంగ్ డాల్ సూప్:  1/2 కప్పు పచ్చ పెసలు లేదా పచ్చ పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టి, చిటికెడు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నెయ్యి లేదా నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉడికించిన పప్పును తాలింపులో పోయాలి. అవసరమైనంత నీరు పోసి, 4-5 నిమిషాలు ఉడికించాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేయాలి. చిన్నపిల్లలకు, వృద్ధులకు పెసరపప్పు సూప్ ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, వెల్లుల్లి చేర్చితే రుచి అదిరిపోతుంది.

3 / 6
పెసరపప్పు హల్వా: పెసరపప్పుతో కేవలం కారం వంటకాలే కాకుండా తీపి పదార్థాలు కూడా చేయవచ్చు. పెసరపప్పును శుభ్రం చేసి, నీటిలో ఉడికించి మెత్తగా చేయాలి. మెత్తగా చేసిన పెసరపప్పు మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి. జీడిపప్పును వేయించి, బాదం పొడి, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. ఒక నాన్-స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. దీనిలో కలిపి ఉంచిన మిశ్రమాన్ని వేసి నెమ్మదిగా వేయించాలి. హల్వా కాస్త చిక్కబడిన తర్వాత దింపి, వడ్డించాలి. ఇది పిల్లలకు ఎంతో బలాన్నిస్తుంది.

4 / 6
పెసర లడ్డూ: పెసర లడ్డూలు రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి బలాన్నిస్తాయి. ముఖ్యంగా పచ్చ పెసరపప్పుతో చేసే ఈ లడ్డూలలో ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. పెసరపప్పు, బెల్లం (లేదా చక్కెర), నెయ్యితో వీటిని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెరుగుతున్న పిల్లలకు, నీరసంతో బాధపడేవారికి ఇది ఒక పరిపూర్ణమైన పౌష్టికాహారం. ఈ స్వీట్ రెసిపీని తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.

5 / 6
పెసర వడలు: సాయంత్రం పూట ఏదైనా కరకరలాడేలా తినాలనిపిస్తే, నానబెట్టిన పెసరపప్పుతో వడలు చేసుకోవచ్చు. ఇది శనగపిండి వడల కంటే ఆరోగ్యకరమైనవి, త్వరగా అరుగుతాయి. పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి. అవి రుచికరమైనవి, పోషకమైనవి. వారానికి కనీసం రెండుసార్లు పెసలు తినండి.  పెసరపప్పు కేవలం పప్పు చారుకే పరిమితం కాకుండా, ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఈ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో రక్షణనిస్తాయి.

6 / 6
Follow Us