- Telugu News Photo Gallery Health Benefits of Black Grapes: Eat grapes for better eye care and heart health
Black Grapes: కళ్లు, గుండెను పదిలంగా ఉంచే నల్ల ద్రాక్ష.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ బి, కాల్షియం, భాస్వరం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నల్ల ద్రాక్ష గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది..
Updated on: Feb 14, 2025 | 8:21 PM

నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ బి, కాల్షియం, భాస్వరం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నల్ల ద్రాక్ష గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగులలో వివిధ దేశాల్లో దర్శనమిస్తాయి. వీటి రుచి కూడా భిన్నంగా ఉంటుంది. ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ బి, కాల్షియం, భాస్వరం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Black grapes

పొటాషియం అధికంగా ఉండే నల్ల ద్రాక్ష అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా, నల్ల ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా రెస్వెరాట్రాల్, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

నల్ల ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఇబ్బంది పడుతున్న వారు నల్ల ద్రాక్షను తినవచ్చు. ద్రాక్ష పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉండటం, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల, బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఆహారంలో ద్రాక్షను చేర్చుకోవచ్చు.





























