డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 2023కి వీడ్కోలు చెబుతూ .. కొత్త సంవత్సరానికి సంతోషంగా స్వాగతం పలికారు. జబల్పూర్ లో సీతారాముల వేషధారణతో ఉన్న ఓ అందమైన చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. కొంతమంది కళాకారులు సీతాదేవి, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి గెటప్‌లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కనిపించారు.
2024 జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నూతన సంవత్సర వేడుకల్లో కూడా ఎక్కడ చూసినా శ్రీరాముడి వైభవమే కనిపించింది. ప్రజలు తమ భావాలను.. శ్రీరాముడి మీద ఉన్న భక్తిని తమదైన రీతిలో వ్యక్తం చేశారు. ఒక భక్తుడు తన నుదుటిపై శ్రీరాముని నామాన్ని రాసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. ఈ అందమైన చిత్రం నాగ్‌పూర్ కు చెందినదిగా తెలుస్తోంది.
ఎక్కువ మంది కొత్త సంవత్సరాన్ని దేవుడి సన్నిధిలో ప్రారంభించాలని కోరుకుంటారు. ఈ నేపధ్యంలో డిసెంబర్ 31 సాయంత్రం వారణాసిలో భక్తుల రద్దీ నెలకొంది. పరమశివుడు కొలువై ఉండే కాశీలో విశ్వనాథుడిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు చేరుకున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీలోని గురుగ్రామ్ చాలా అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు. డిసెంబర్ 31 అర్ధ రాత్రి 2023కి వీడ్కోలు చెప్పడానికి.. 2024కి స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఎక్కడ చూసినా అందమైన దృశ్యం కనుల విందు చేసింది. ప్రతిచోటా లైట్లు మెరిసాయి.
దేశంలో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ సందడి నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ లోని ముఖ్యం పట్టణం సిమ్లా లో కొందరు మహిళలు.. హిమాచల్ సంప్రదాయ దుస్తులు ధరించిన చేతుల్లో బెలూన్‌లను పట్టుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
శ్రీ నగర్‌లోని ప్రజలు కూడా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పారు. భారీ సంఖ్యలో లాల్ చౌక్ దగ్గర ప్రజలు చేరుకున్నారు. ఎంతో సంతోషంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈ దృశ్యం అద్భుతమైనది.
సిమ్లా కూడా 2024కి స్వాగతం భిన్నమైన రీతిలో పలికారు. న్యూ ఇయర్ సందర్భంగా, సిమ్లాలో భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. కొత్త సంవత్సరాన్ని చాలా ఉత్సాహంగా స్వాగతించారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు 2024 సంవత్సరం స్వాగతం చెబుతూ.. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మొక్కలతో ఈ అయోధ్య రామాలయాన్ని అద్భుతంగా రూపొందించారు.