AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: గోల్డ్‌లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే తిప్పలు

భారతదేశంలో బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సురక్షితమైన ఆస్తిగా పరిగణించబడుతుంది. ఇది కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడు వంటిది. మనం ఎంత పక్కాగా ఆర్థిక ప్రణాళికలు వేసుకున్నా, అప్పుడప్పుడు అకస్మాత్తుగా డబ్బు అవసరం అవుతుంది. అటువంటి అత్యవసర సమయాల్లో, మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం సులభమైన, సురక్షితమైన మార్గం. అయితే ఇలా లోన్ తీసుకునేప్పుడు కొన్ని విషయాలు గమనించకపోవడం వల్ల కస్టమర్‌లు ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీకే లభించే ఈ బంగారు రుణాన్ని మరింత లాభదాయకంగా ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి

Anand T
|

Updated on: Mar 27, 2026 | 10:46 AM

Share
బ్యాంకులు వర్సెస్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు : ఒక వేళ మీరు గోల్డ్‌ లోన్ తీసుకోవాలని అనుకుంటే ముందుగా ఎక్కడ వడ్డీ రేటు తక్కువగా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకులలో బంగారు రుణాలపై వడ్డీ రేటు కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. ఆర్థిక సంస్థలలో రుణ మొత్తం త్వరగా మంజూరైనప్పటికీ, మీరు తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే బ్యాంకులను సంప్రదించడం మంచిది.

1 / 5
తిరిగి చెల్లించే కాలపరిమితి:  మీరు తీసుకున్న రుణాన్ని నిర్ణీత కాలంలోగా తిరిగి చెల్లించకపోతే, సదరు సంస్థ మీ బంగారాన్ని వేలం వేసే అవకాశం ఉంది. బ్యాంకులు సాధారణంగా 3 నెలల నుండి 3 సంవత్సరాల వరకు కాలపరిమితిని ఇస్తాయి. కాబట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి సరైన కాలపరిమితిని ఎంచుకోవడం మంచిది.

2 / 5
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు: మీరు తాకట్టు పెట్టే బంగారం ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా మీకు రుణం లభిస్తుంది. అయితే, రుణం తీసుకున్న తర్వాత మార్కెట్లో బంగారం ధరలు అకస్మాత్తుగా భారీగా తగ్గితే, అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టమని లేదా కొంత నగదు చెల్లించమని బ్యాంకులు అడిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

3 / 5
సులభమైన నిబంధనలు: పర్సనల్ లోన్ లేదా ప్రాపర్టీ లోన్‌తో పోలిస్తే బంగారు రుణ నిబంధనలు చాలా సులభం. ఎందుకంటే ఇక్కడ మీ బంగారం హామీగా ఉంటుంది. దీనివల్ల బ్యాంకులు ఎటువంటి రిస్క్ లేకుండా త్వరగా రుణాన్ని మంజూరు చేస్తాయి.

4 / 5
సిబిల్ స్కోర్: గోల్డ్‌ లోన్ తీసుకునే వారకి బెనిఫిట్‌ ఏమిటంటే..మీకు సిబిల్‌ స్కోర్ అవసరం లేకుండానే గోల్డ్‌ లోన్‌ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ మీ సిబిల్ స్కోర్ ఇక్కడ పరిగణనలోకి తీసుకోరు. మీరు ఇచ్చే బంగారం బరువు, నాణ్యత ఆధారంగానే మీకు లోన్ ఇస్తారు. అందుకే అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిమిషాల వ్యవధిలోనే డబ్బు మీ చేతికి రావాలంటే గోల్డ్ ఓ మంచి మార్గం.

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే