*ఆధిపత్యం చలాయించేవారు:* తామే గొప్ప.. మహిళలు ఎప్పుడూ తమకంటే తక్కువ అనే స్వభావం ఉన్న అబ్బాయిలను.. అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. మహిళలను కించపరిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టని అబ్బాయిల నుంచి అమ్మాయిలు ఎప్పుడూ దూరంగా ఉండాలని అనుకుంటారు. ఒకవేళ మీది కూడా అదే స్వభావం అయితే.. వెంటనే మార్చుకోండి. ప్రస్తుతం స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే. అన్ని రంగాల్లోనూ పురుషులకు పోటీ ఇస్తూ మహిళలు దూసుకుపోతున్నారని గుర్తించుకోండి.