AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geyser Safety: గీజర్ వాడుతున్నారా.. ఈ 4 తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. లైట్ తీసుకోవద్దు..

చలికాలం ప్రారంభం కాగానే వేడీ నీటి అవసరం పెరుగుతుంది. చాలా ఇళ్లలో గీజర్లు లేదా హీటర్లు ప్రధానంగా మారినప్పటికీ.. వాటిని నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల ప్రమాదంగా మారే అవకాశం ఉంది. మీరు ఎలక్ట్రిక్ గీజర్, సోలార్ హీటర్ లేదా ఇమ్మర్షన్ రాడ్ ఉపయోగించినా.. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. చిన్న పొరపాటు కూడా షార్ట్ సర్క్యూట్‌లు లేదా విద్యుత్ షాక్‌లకు దారితీయవచ్చు.

Krishna S
|

Updated on: Nov 15, 2025 | 2:00 PM

Share
ఆన్‌లో ఉంచవద్దు: చాలా మంది వేడి నీళ్లు చల్లబడతాయేమోనని స్నానం చేసేటప్పుడు గీజర్‌ను స్విచ్ ఆన్‌లో ఉంచుతారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. కరెంట్ హెచ్చుతగ్గులు లేదా లోపం తలెత్తితే, నీటి ద్వారా తక్షణమే కరెంట్ షాక్‌కు కారణం కావచ్చు. షవర్ కింద స్నానం చేసే ముందు తప్పకుండా స్విచ్ ఆఫ్ చేయండి.

1 / 5
మంచి కంపెనీ: తక్కువ ధరకు వస్తుందని స్థానికంగా తయారు చేసిన, నాణ్యత లేని గీజర్లను కొనకండి. భద్రత కోసం మంచి కంపెనీ, సర్టిఫికేషన్ ఉన్న వాటినే ఎంచుకోండి.
తక్కువ ధరకు దొరికే మోడళ్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవచ్చు. దాంతో షార్ట్ సర్క్యూట్‌లు  లేదా ఇతర తీవ్ర ప్రమాదాలకు దారితీయవచ్చు.

మంచి కంపెనీ: తక్కువ ధరకు వస్తుందని స్థానికంగా తయారు చేసిన, నాణ్యత లేని గీజర్లను కొనకండి. భద్రత కోసం మంచి కంపెనీ, సర్టిఫికేషన్ ఉన్న వాటినే ఎంచుకోండి. తక్కువ ధరకు దొరికే మోడళ్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవచ్చు. దాంతో షార్ట్ సర్క్యూట్‌లు లేదా ఇతర తీవ్ర ప్రమాదాలకు దారితీయవచ్చు.

2 / 5
చెక్ చేయించండి: వేసవి అంతా ఆపి ఉంచిన గీజర్‌ను చలికాలంలో మొదటిసారి ఆన్ చేసే ముందు ఒకసారి ఎలక్ట్రీషియన్‌తో చూపించండి. చిన్న లోపం కూడా వేడెక్కడం లేదా పెద్ద షార్ట్ సర్క్యూట్‌లకు దారితీయవచ్చు.

చెక్ చేయించండి: వేసవి అంతా ఆపి ఉంచిన గీజర్‌ను చలికాలంలో మొదటిసారి ఆన్ చేసే ముందు ఒకసారి ఎలక్ట్రీషియన్‌తో చూపించండి. చిన్న లోపం కూడా వేడెక్కడం లేదా పెద్ద షార్ట్ సర్క్యూట్‌లకు దారితీయవచ్చు.

3 / 5
నీళ్లు మరీ వేడిగా చేయకండి: నీటి ఉష్ణోగ్రతను 40 నుండి 50 డిగ్రీల మధ్య ఉండేలా సెట్ చేసుకోండి. మరీ వేడి చేస్తే కాలిన గాయాలయ్యే ప్రమాదం ఉంది. గీజర్ కూడా పాడవుతుంది.
సెట్టింగుల తర్వాత కూడా నీరు ఎక్కువగా వేడెక్కితే వెంటనే ఎలక్ట్రీషియన్‌తో దాన్ని తనిఖీ చేయించండి.

నీళ్లు మరీ వేడిగా చేయకండి: నీటి ఉష్ణోగ్రతను 40 నుండి 50 డిగ్రీల మధ్య ఉండేలా సెట్ చేసుకోండి. మరీ వేడి చేస్తే కాలిన గాయాలయ్యే ప్రమాదం ఉంది. గీజర్ కూడా పాడవుతుంది. సెట్టింగుల తర్వాత కూడా నీరు ఎక్కువగా వేడెక్కితే వెంటనే ఎలక్ట్రీషియన్‌తో దాన్ని తనిఖీ చేయించండి.

4 / 5
ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే గీజర్లు ఉపయోగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చిన్న పొరపాట్లు కూడా పెద్ద నష్టాన్ని తీసుకొస్తాయి. కాబట్టి గీజర్ల విషయంలో నిర్లక్ష్యం తగదు.

ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే గీజర్లు ఉపయోగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చిన్న పొరపాట్లు కూడా పెద్ద నష్టాన్ని తీసుకొస్తాయి. కాబట్టి గీజర్ల విషయంలో నిర్లక్ష్యం తగదు.

5 / 5