పచ్చి వెల్లుల్లి తింటున్నారా..? అయితే జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
ఎన్నో ఔషధ గుణాలు దాగున్న వెల్లుల్లిలో ప్రతికూలతలు కూడా దాగున్నాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. మీరు కూడా వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే.. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా రక్తం పలుచబడటం లాంటి సమస్య ఏర్పడుతుంది. వెల్లుల్లిని అతిగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి..
Updated on: Jul 19, 2025 | 2:28 PM

వెల్లుల్లిలో ఉండే ప్రధాన సమ్మేళనం అల్లిసిన్. వెల్లుల్లిని నలగ్గొట్టినప్పుడు లేదా కోసినప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. వెల్లుల్లిని నలగ్గొట్టగానే వచ్చే ఆ ఘాటైన వాసన, అందులో ఉండే అల్లిసిన్ అనే పదార్థం వల్లే వస్తుంది. ఇదే దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. పచ్చి వెల్లుల్లి క్రిములను చంపుతుంది. అల్లిసిన్ యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉందని నిరూపించబడింది.

లోబీపీ: అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి పచ్చి వెల్లుల్లి తినడం మేలు చేస్తుంది. కానీ రోజూ ఎక్కువగా తింటే రక్తపోటు తగ్గి.. లోబీపీకి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయి..

జీర్ణక్రియ సమస్యలు: ఆయుర్వేదం ప్రకారం.. వెల్లుల్లి వేడి స్వభావం కలిగి ఉంటుంది. అందుకే.. ఎక్కువ మోతాదులో తినడం వల్ల జీర్ణ సమస్యలు మొదలవుతాయి.. మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని.. తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తాజా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం, తెల్ల రక్త కణాలను ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ప్రేరేపిస్తుంది. జలుబు, ఫ్లూ సీజన్లలో క్రమం తప్పకుండా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అనారోగ్యం నుండి మనల్ని కాపాడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రోజూ మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అంతర్గతంగా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది మొటిమలను తగ్గిస్తుంది. చర్మంపై ముడతలను ఆలస్యం చేస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

రక్తం పలుచబడటం: పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తింటే.. రక్తం పలుచబడతుంది. దీనిలో రక్తాన్ని పలుచగా చేసే అంశాలు ఉంటాయి. ఇంకా కొన్ని మందులు వాడుతున్నట్లయితే, పచ్చి వెల్లుల్లిని తినకపోవడమే మంచిది.

Health Benefits Of Garlic




