- Telugu News Photo Gallery Fruits for Lungs Health: These 4 Foods Help Reduce Mucus in Lungs during rainy season
Fruits for Lungs Health: వర్షంలో తడిచారా? జలుబు చేయకూడదంటే ఈ పండ్లు తినడం ప్రారంభించండి
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షంలో ఒక్కోసారి తడిచిపోతుంటాం. దీంతో జలుబు, దగ్గు, జ్వరం.. వంటి సమస్యలు దాడి చేస్తాయి. ఈ సమయంలో యాంటీబయాటిక్స్ తీసుకోకుండా జ్వరం కావడం దాదాపు అసాధ్యం.కొన్నిసార్లు జ్వరం తగ్గినా.. జలుబు మాత్రం ఓ పట్టాన తగ్గదు. ఛాతీలో కఫం పేరుకుపోతుంది. పైగా, COPD రోగి అయితే, ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది..
Updated on: Aug 29, 2024 | 8:31 PM

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షంలో ఒక్కోసారి తడిచిపోతుంటాం. దీంతో జలుబు, దగ్గు, జ్వరం.. వంటి సమస్యలు దాడి చేస్తాయి. ఈ సమయంలో యాంటీబయాటిక్స్ తీసుకోకుండా జ్వరం కావడం దాదాపు అసాధ్యం.కొన్నిసార్లు జ్వరం తగ్గినా.. జలుబు మాత్రం ఓ పట్టాన తగ్గదు. ఛాతీలో కఫం పేరుకుపోతుంది. పైగా, COPD రోగి అయితే, ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

తేమ వాతావరణంలో ఊపిరితిత్తులలో కఫం చేరడం వల్ల దగ్గు, శ్వాస ఆడకపోవడం, గొంతు నొప్పి, ఛాతీ భారంగా ఉండటం, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు వంటి అనేక సమస్యలు వస్తాయి. కొంతమంది ఛాతీలో పేరుకుపోయిన కఫం తొలగించడానికి వేడి నీటి ఆవిరిని తీసుకుంటారు. మరికొందరు వేడి ద్రవ ఆహారాన్ని తీసుకుంటారు. అయితే ఈ కింది 4 రకాల పండ్లు ఈ సమయంలో తింటే జలుబు నుంచి సులువుగా బయటపడవచ్చు.

యాపిల్ తింటే వెయ్యి రోగాలకు దూరంగా ఉండొచ్చు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడంలో యాపిల్స్ ఉపయోగపడతాయి. జ్వరం, జలుబు నుంచి త్వరగా కోలుకోవడానికి యాపిల్స్ సహాయం చేస్తాయి.

వర్షాకాలంలో జామపండ్లు అధికంగా లభిస్తాయి. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు జామ నాలుక రుచిని పునరుద్ధరిస్తుంది. వ్యాధిని కూడా తొలగిస్తుంది.

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి రోజూ ఒక ఉసిరికాయ తినాలి. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ నుండి సురక్షితంగా ఉండటానికి సిట్రస్ పండ్ల రసం తాగాలి. ఈ పండ్ల రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.




