
డబ్బు ఉంటే చాలు ఎక్కడికైనా వెళ్లవచ్చని అనుకుంటున్నారా? మీరు ఎంత ఖర్చు పెట్టినా కొన్ని ప్రదేశాలకు వెళ్లలేరని మీకు తెలుసా? అవును మీరు వింటున్నది నిజమే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలోని కొన్ని దేశాలు కొన్ని ప్రాంతాలకు వెళ్లడాన్ని నిషేధించాయి. నిషేధించిన ప్రాంతాల్లో కొన్ని ప్రమాదకరమైనవి అలాగే మరికొన్ని విచిత్ర కారణాలకు పర్యటనలను నిషేధించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్లేస్ లను మీ ముందుకు తీసుకువచ్చాం. అవేంటో ఓ లుక్కెయ్యండి

నార్త్ సెంటినల్ ఐలాండ్ అండమాన్ లో ఉన్న నార్త్ సెంటినల్ ఐలాండ్ సెంటినల్ తెగల ప్రజలకు నిలయం. నిషేధిత ద్వీపాల్లో ఇది ఒకటి. ఇక్కడి ప్రజలకు బయట ప్రపంచం గురించి తెలియదు. ఈ ద్వీపానికి వచ్చే ఈ తెగ ప్రజలు పర్యాటకులపై హింసాత్మకంగా దాడి చేస్తున్నారు. దీంతో సెంటినల్ తెగ రక్షణకు ప్రభుత్వం ఈ ఐలాండ్ కు వెళ్లడాన్ని నిషేధించింది.

స్నేక్ ఐలాండ్, బ్రెజిల్ పేరుకు తగినట్టే బ్రెజిల్ లో ఉండే ఈ ఐలాండ్ లో ప్రమాదకర పాములు ఉన్నాయి. ఇక్కడకు వెళ్తే ఒక్కరోజు కూడా బతకలేరు. బ్రెజిల్ ప్రభుత్వం ఈ ఐలాండ్ కు వెళ్లడాన్ని నిషేధించింది. ఓ నివేదిక ప్రకారం ఈ ఐలాండ్ 4000 రకాల పాములున్నాయని అంచనా.

సుర్ట్సే ఐలాండ్ నాలుగేళ్లుగా అగ్ని పర్వాతాల విస్పోటనం కారణంగా ఈ ఐలాండ్ ఏర్పడింది. ఇది ఐస్లాండ్ లోని దక్షిణ ప్రాంతంలోని ఓ చిన్న ద్వీపం. ప్రస్తుతానికి కొంత మంది శాస్త్రవేత్తలను మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతిస్తుంది. అక్కడి పర్యావరణ క్రమాన్ని వారు అంచనా వేస్తున్నారు.

ఇజ్ గ్రాండ్, జపాన్ జపాన్ లో దాదాపు 8000 ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కటైన ఇజ్ గ్రాండ్ ప్రాంతానికి కేవలం జపాన్ కు చెందిన రాజవంశీయులను మాత్రమే అనుమతిస్తారు. 8 శతాబ్ధానికి చెందిన షింటో సాంప్రదాయాలను ఇక్కడ పాటిస్తారు.