జీవితంలో తప్పక చూడాల్సిన ఐదు అద్భుతమైన ప్రదేశాలివే!

Updated on: Aug 30, 2025 | 7:40 AM

ఫ్యామిలీ లేదా స్నేహితులతో కలిసి టూర్ వెళ్లాలని ఎవరు కోరు కోరు చెప్పండి. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి ఆనందంగా అందమైన ప్రదేశాలు చుట్టి రావాలనుకుంటారు చాలా మంది. అయితే అందులో తప్పకుండా ఈ ఐదు ప్రదేశాలను 40 ఏళ్ల లోపు చూసెయ్యాల్సిందేనంట. మరి ఆ ప్లేసెస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
కుటుంబ సభ్యుతో మంచి ట్రిప్‌కు వెళ్లాలి అనుకునేవారికి రిషికేష్ బెస్ట్ ప్లేస్. సాహస ప్రియులకు ఇది అద్భుతమైన పర్యాటక ప్రాంతం అని చెప్పాలి. ఎందుకంటే? రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్, క్యాంపింగ్ వంటివి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికంగా ఇది మనసుకు మంచి ప్రశాంతతను ఇస్తుంది. గంగా ఘాట్‌లో హారతి చూడటం చాలా ఆనందాన్ని ఇస్తుంది.

2 / 5
గోవా : స్నేహితులతో లేదా కపుల్స్ ఎంజాయ్ చేయడానికి ఉత్తమమైన ప్రదేశం గోవా. ఇక్కడ బీచ్ చాలా మందిని ఆకర్షిస్తుంది. వాటర్ స్పోర్ట్, చీచ్ పార్టీ, నైట్ లైఫ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కపుల్స్‌తో వెళ్తే చాలా ఎంజాయ్ చేయవచ్చునంట. ఇక స్నేహితులతో గోవాకి వెళ్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అందుకే ప్రతి ఒక్కరూ 40 ఏళ్ల వయసులోపే ఈ ప్రదేశాలను చుట్టేసిరావలంట.

3 / 5
మనాలి : హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న అందమైన ప్రదేశాల్లో మనాలి ఒకటి. ఇక్కడి వాతావరణం, పచ్చటి చెట్లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ట్రిప్ స్నేహితులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సోలాంగ్ వ్యాలీ, మంచుతో కప్పబడిన శిఖరాలు, రోహ్తాంగ్ పాస్ రోడ్ ట్రిప్ ఇవ్వనీ చాలా బాగుంటాయంట.

4 / 5
లడఖ్ రోడ్ ట్రిప్ : జీవితంలో 40 ఏళ్లలోపు చూడాల్సిన ప్రదేశాల్లో లడక్ ట్రిప్ ఒకటి. ఈ ప్రదేశం చూడటానికి రెండు కళ్లు చాలావు. లేహ్, నుబ్రా వ్యాలీ, ప్యాంగోంగ్ సరస్సు, ఖర్దుంగ్ , వంటి ప్రదేశాలు చాలా బాగుంటాయి. బైక్ ట్రిప్ అయినా కారు ట్రిప్ అయినా సరే జీవితంలో తప్పకుండా ఒకసారి ఈ ప్రదేశానికి వెళ్లాల్సిందేనంట.

5 / 5
అరుకు : అందమైన ప్రదేశాల్లో అరుకు లోయలు ఒకటి. ఇక్కడి ఎత్తైన కొండలు, పచ్చటి చెట్లు, రైలు మార్గాలు, కాఫీ తోటలు, పూలతోటలు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ లో ఇదొక్కటి, స్నేహితులతోనైనా, ఫ్యామిలీతోనైనా, కపుల్స్ అయినా ఎవ్వరైనా సరే ఈ ప్రదేశానికి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారంట.