- Telugu News Photo Gallery Experts say that simple exercise can reduce the problem of snoring Telugu News
Snoring: గురకతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ టిప్ పాటిస్తే సుఖవంతమైన నిద్ర మీ సొంతం..
నిద్రపోయే సమయంలో ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా ఇబ్బంది కలిగిస్తుంటుంది. అలాంటిది మన పక్కన నిద్రపోతున్న వారు గురక పెడితే.. వామ్మో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో దానిని ఫేస్ చేసే వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే ఇలాంటి గురక సమస్యను అధిగమించేందుకు సులభమైన రీతిలో వ్యాయాం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ...
Updated on: Dec 19, 2022 | 3:27 PM

గురక పెట్టడం వల్ల నిద్ర కూడా సరిపోయినట్లు ఉండదు. ఇతరులు గురక పెడితే మనకు నిద్రాభంగం.. మనం పెట్టినా ఇతరులు మనల్ని నిద్రలేపేందుకు నిద్రాభంగం కలిగిస్తారు. గురక సమస్య నుంచి బయట పడేందుకు చేసే అనేక ప్రయత్నాలో భాగంగా మెడిసిన్లు వాడుతుంటారు. కానీ అలా కాకుండా సులభమైన వ్యాయామం ద్వారా గురక సమస్యను పరిష్కరించుకోవచ్చు.

సాధారణంగా నిద్రపోయేటప్పుడు మన నాలుక, గొంతు, నోరు, శ్వాసనాళాల్లో ఏదో ఒక అడ్డంకి లేదా ఏదైనా కంపనం ఏర్పడినప్పుడు గురక శబ్దం వస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరంలోని ఈ భాగాలు విశ్రాంతి, సంకోచం, విశ్రాంతి పొందుతాయి. దీని కారణంగా ఇది జరుగుతుంది.

కొందరు శరీర బరువు పెరిగినా కూడా తరచుగా గురక సమస్యతో బాధపడుతుంటారు. ఇదే కాకుండా దీర్ఘకాలంగా పొగతాగడం, అతిగా మద్యం సేవించడం లేదా నిద్రలో గొంతుపై ఎలాంటి ఒత్తిడి కలిగినా కూడా గురక వస్తుంది.

గురకను సమస్యను అధిగమించేందుకు వ్యాయామాలను అభ్యసించమని జీవశాస్త్రజ్ఞుల సూచిస్తున్నారు. గురక కోసం చేసే ఈ వ్యాయమం ఎలా చేయాలంటే.. మీ నాలుకను పంటి ముందు భాగంలో దిగువకు తాకడానికి ప్రయత్నించండి. ఆపై లోపలికి విస్తరించేటప్పుడు ‘క్లిక్’ శబ్దం చేయండి. మీరు ఈ ధ్వనిని బిగ్గరగా చేయవచ్చు.

ఇలా చేయడం వల్ల కాలక్రమేణా కండరాలు బలంగా ఉంటాయి. ఇలా కొన్ని రోజుల పాటు నిరంతరం ఆచరించడం వల్ల గురక సమస్య కూడా అనతి కాలంలోనే దూరమవుతుంది. ఈ వ్యాయామం ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు.



