AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dragon Fruit: పోషకాల గని.. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని ప్రయోజనాలా..?

డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు మన దేశంలో విరివిగా లభిస్తోంది. అధిక ఫైబర్ కలిగిన ఈ పండు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. మలబద్ధకం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా దీనిని తినవచ్చు. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Phani CH
|

Updated on: Aug 31, 2026 | 3:52 PM

Share
ప్రకృతి ప్రసాదించిన అనేక పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ అత్యంత విశేషమైనది. ఒకప్పుడు విదేశీ పండుగా మాత్రమే పరిగణించే డ్రాగన్ ఫ్రూట్.. ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విరివిగా పండిస్తున్నారు. దీని లభ్యత పెరగడంతో ఒకప్పుడు అధికంగా ఉన్న ధరలు గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు కేజీ 100కే దొరుకుతున్నాయి.

1 / 5
అయితే.. డ్రాగన్ ఫ్రూట్ నిజంగా పోషకాల గని. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉన్నాయి.. అందుకే.. దీనిని తినాలని సూచిస్తున్నారు డైటీషియన్లు..

2 / 5
డ్రాగన్ ఫ్రూట్ అధిక ఫైబర్ ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ పండును తీసుకోవడం వల్ల మలబద్ధకం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.

3 / 5
డ్రాగన్ ఫ్రూట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా సురక్షితమైనది. అంతేకాకుండా, డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అంతేకాకుండా.. జీర్ణక్రియ మెరుగుపర్చి కడుపు సమస్యలను నివారిస్తుంది.

4 / 5
ఈ బహుముఖ ప్రయోజనాలతో కూడిన పండును ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మీ ఆహారంలో భాగం చేసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు..

5 / 5
Follow Us