
కనీసం రోజుకు ఒక అరటి పండు తినాలంటారు, ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం, కాల్షియం శరీరానికి తక్షణ శక్తిని అందివ్వడమే కాకుండా, ఎముకలు, కండరాల బలానికి తోడ్పడుతుంది. ఇక బొప్పాయి రక్తప్రసరణను మెరుగు పరచడం, హిమోగ్లోబిన్ పెరుగుదలకు ఉపయోగపడటమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

అరటి పండు, బొప్పాయి రెండింటి లో మంచి పోషక విలువలు ఉంటాయి. ఇవి రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా చాలా విరివిగా దొరుకుతాయి. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ రెండు పండ్లు వేరు వేరుగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ, ఈ రెండు అస్సలే కలిపి తినకూడదని చెబుతుంటారు. ఎందుకంటే? ఈ రెండూ వేరు వేరు లక్షణాలు కలిగిఉంటాయి.

ముఖ్యంగా అరటి పండ్లు అనేవి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. కానీ బొప్పాయి శరీరానికి వేడిని అందిస్తుంది. ఈ రెండూ కూడా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటాయి. అందువలన వీటిని కలిపి తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట. కొన్ని సార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి, ప్రాణానికే ముప్పు కూడా వాటిల్లే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

బొప్పాయి చర్మానికి మేలు చేస్తుంది. బొప్పాయిని ముఖానికి రాసుకోవడం వల్ల అనేక సమస్యలు నయమవుతాయి. అయితే మీకు ఏవైనా చర్మ వ్యాధులు ఉంటే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ బొప్పాయిని ముట్టుకోకూడదు.

ఇక జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఈ రెండింటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన తల తిరగడం, కడుపు నొప్పి, వాంతులు , తల నొప్పి వంటి సమస్యలు వస్తాయంట. ( నోట్ : పై వార్త కేవలం ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)