కాఫీలో కెఫిన్ ఉంటుందనే సంగతి తెలిసిందే. కెఫిన్ అనేది జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడే సహజ ఉద్దీపన. ఇది నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచడానికి, కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది. కెఫీన్ మీ హృదయ స్పందన రేటు, శక్తి వ్యయాన్ని తాత్కాలికంగా పెంచుతుంది. రోజంతా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది.