- Telugu News Photo Gallery Do this to check dry skin in winter season, Check Here is Details in Telugu
Dry Skin Remedies: వింటర్ సీజన్‌లో డ్రై స్కిన్‌కి చెక్ పెట్టాలంటే.. ఇలా చేయండి..
చలి కాలంలో సాధారణంగా అందరూ ఫేస్ చేసే సమస్యల్లో డ్రై స్కిన్ కూడా ఒకటి. డ్రై స్కిన్ కారణంగా చర్మం పగిలి చికాకును కలిగిస్తుంది. డ్రై స్కిన్‌తో బాధ పడేవారు ఈ టిప్స్ ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ హోమ్ మేడ్ రెమిడీస్ చక్కగా పని చేస్తాయి..
Updated on: Jan 21, 2025 | 1:01 PM

శీతాకాలంలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌లో డ్రై స్కిన్ కూడా ఒకటి. డ్రై స్కిన్ కారణంగా చర్మం అంతా చికాకుగా కనిపిస్తుంది. చర్మం పగిలి, దురద పెడుతూ, తెల్లగా కనిపిస్తుంది. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ఈ సమస్యను ఫేస్ చేసే చేస్తారు.

చర్మంపై ఉండు దుమ్ము, ధూళి సరిగా పోకుండా ఉండటం వల్ల స్కిన్ అలా మారుతుంది. ఇందు కోసం చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నీటిని, వాటర్ కంటెంట్ ఉన్న డ్రింక్స్ తాగుతూ ఉండాలి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా మారుస్తాయి.

పచ్చి పాలు లేదా గోరు వెచ్చని పాలల్లో కాఫీ పౌడర్ లేదా కొద్దిగా ఉప్పు కలిపి.. ముఖం, మెడ, కాళ్లు, చేతులకు బాగా పట్టించి మర్దనా చేయండి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికిపోతుంది. ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి.

డ్రై స్కిన్‌తో బాధ పడేవారు టోనర్ ఉపయోగించాలి. ఈ టోనర్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. టోనర్‌గా రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. లేదంటే దేశవాళీ గులాబీలను నీటిలో మరిగించి.. చల్లారాక వడకట్టి ఆ నీటిని టోనర్‌గా యూజ్ చేయవచ్చు.

చర్మం పగల కుండా ఉండాలంటే రాత్రిపూట మాయిశ్చరైజర్ అప్లై చేసి పడుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కొబ్బరి నూనె, బాదం ఆయిల్, జొజోబా ఆయిల్, షియా బటర్ వంటివి కూడా అప్లై చేసినా చర్మం ఫ్రెష్‌గా ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




