- Telugu News Photo Gallery Diwali 2023: Meru International School Embraces Diwali Celebrations with Mandal Parishad Primary School Chandanagar
Diwali 2023: మేరు ఇంటర్నేషనల్ స్కూల్.. ఎంపీపీఎస్ విద్యార్థులతో సరికొత్త ప్రయోగం.. చరిత్రలో ఇదే తొలిసారి
మియాపూర్‌లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్.. చందానగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో అనుసంధానమై దీపావళి వేడుకలను నిర్వహించింది. ఇలా జరుపుకోవడం చరిత్రలోనే మొదటి సారి. ప్రభుత్వ పాఠశాలలతో మైత్రీ బంధాన్ని కొనసాగిస్తూ అంతర్జాతీయ స్టాండర్డ్స్ కలిగిన పెద్ద పెద్ద పాఠశాలలు ఇలా ఈవెంట్స్ ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో చిన్న పెద్ద అనే తారతమ్యం తొలిగిపోయి మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీపావళి అంటే దీపాల పండుగ.
Srikar T |
Updated on: Nov 10, 2023 | 5:24 PM

మియాపూర్‌లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్.. చందానగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో అనుసంధానమై దీపావళి వేడుకలను నిర్వహించింది. ఇలా జరుపుకోవడం చరిత్రలోనే మొదటి సారి.

ప్రభుత్వ పాఠశాలలతో మైత్రీ బంధాన్ని కొనసాగిస్తూ అంతర్జాతీయ స్టాండర్డ్స్ కలిగిన పెద్ద పెద్ద పాఠశాలలు ఇలా ఈవెంట్స్ ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో చిన్న పెద్ద అనే తారతమ్యం తొలిగిపోయి మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది.

దీపావళి అంటే దీపాల పండుగ. ప్రతి ఒక్కరి జీవితంతో వెలుగులు నిండాలని దేశ వ్యాప్తంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ సందర్భంగా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడం ఆలా ఆనందించాల్సిన విషయం.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దీపాలను వెలిగించి సందడి చేశారు. మ్యూజిక్, డ్యాన్స్, రంగోలీ పోటీలు నిర్వహించారు. కాగా మేరు, మండల్ పరిషత్ పాఠశాలల నుంచి సుమారు 130 మందికి పైగా పిల్లలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నాణ్యమైన విద్యను అందించడానికి, విద్యార్థులను సమకాలీన ప్రపంచంతో సాంస్కృతిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కృషి చేస్తుంది. అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు, మంచి విద్యను అందించి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించడంలో కీలకపాత్ర వహిస్తారు.





























