- Telugu News Photo Gallery Diet and Fertility: How to Improve Male Fertility and Quality after married life
పురుషులకు అలర్ట్.. ఆ విషయంలో వీక్ అయ్యారా..? వీటిని తింటే అమేజింగ్ అంతే..
వాస్తవానికి వివాహం తర్వాత ఆరోగ్యకరమైన లైంగిక జీవితం పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శతాబ్దాలుగా ప్రజలు తమ లైంగిక పనితీరు, సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి కొన్ని ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే.. నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహార పదార్థాలు స్టామినా, లిబిడోను మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి.
Updated on: Feb 03, 2025 | 6:28 PM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చర్యలు తీసుకోవడం, ఆహారంపై దృష్టిసారించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.. వాస్తవానికి వివాహం తర్వాత ఆరోగ్యకరమైన లైంగిక జీవితం పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శతాబ్దాలుగా ప్రజలు తమ లైంగిక పనితీరు, సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి కొన్ని ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే.. నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహార పదార్థాలు స్టామినా, లిబిడోను మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి. పెళ్లైన తరువాత పురుషులు తండ్రి కావాలని కోరుకుంటారు.. కానీ వారి సంతానోత్పత్తి బలహీనంగా ఉంటే, వారు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.. ఇలాంటి భయాందోళనలకు బదులుగా, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా సంతానలేమి సమస్యను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచే ఐదు ఆహారాల గురించి తెలుసుకోండి..

పండ్లు: పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల అంగస్తంభన సమస్య 14% తగ్గుతుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. దీనికి కారణం కొన్ని పండ్లలో అధిక ఫ్లేవనాయిడ్లు ఉండటమే.. బెర్రీలు, ద్రాక్షలు, యాపిల్స్, సిట్రస్ పండ్లు వంటి పండ్లలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ అంగస్తంభనలను మెరుగుపరుస్తుంది. మీ లిబిడోను పెంచుతుంది.. ఎందుకంటే ఇందులో సిట్రులిన్ ఉంటుంది.. ఇది శరీరంలో అర్జినైన్ వంటి అమైనో ఆమ్లాలను విడుదల చేస్తుంది.

గింజలు - డ్రైఫ్రూట్స్: బాదం, వాల్‌నట్, జీడిపప్పు, వేరుశెనగ, హాజెల్ నట్స్ వంటి అన్ని రకాల గింజలలో జింక్, అర్జినైన్ పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నందున చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అదనంగా, వాల్‌నట్‌లు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి.. ఇంకా పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.

కాఫీ: ఒక కప్పు కాఫీలో ఉండే కెఫిన్ పడకగదిలో మంచి అనుభూతిని కలిగిస్తుంది. కానీ దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల మీరు చిరాకుగా అనిపించవచ్చు.. కానీ.. ఇది లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే.. కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.. ఇది అలసట, పొడిబారడం, ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, ఒక రోజులో ఒకటి నుంచి మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తీసుకోవద్దు.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అదే సమయంలో లైంగిక ఆరోగ్యం కోసం, అలాగే పనితీరును అందించడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనోల్స్ రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి.. ఇది పురుషులు అంగస్తంభన సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఇందుకోసం కనీసం 60 శాతం కోకోతో చేసిన డార్క్ చాక్లెట్ తినండి.

మాంసం: మాంసం అధిక అమైనో యాసిడ్ ప్రొఫైల్‌తో ప్రోటీన్-రిచ్ ఫుడ్.. చాలా మాంసంలో జింక్, కార్నిటైన్, అర్జినైన్ వంటి పోషకాలు ఉంటాయి.. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇది అంగస్తంభన సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుందని అనేక పరిశోధనలలో నిరూపించబడింది.





























