శరీరంలో విటమిన్ B12 లోపం మానసిక సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలతో సహా వివిధ సమస్యలను కలిగిస్తుంది. రక్తంలో చక్కెర కూడా పేరుకుపోతుంది. కాబట్టి మధుమేహం రాకుండా ఉండాలంటే విటమిన్-బి12 పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలి. చర్మం, జుట్టు నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు విటమిన్-సి చాలా ముఖ్యం. ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, జలుబు, అలర్జీ వంటి అనేక సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా వేగంగా పెరుగుతాయి. మధుమేహాన్ని నివారించడానికి విటమిన్-సి, డి, బి 12 అధికంగా ఉండే ఆహారాలు తినాలి. అలాగే వేయించిన ఆహారాలు, స్వీట్లు, ముఖ్యంగా చక్కెరను నివారించాలి. ఎక్కువ కూరగాయలు తినాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోకూడదు.