సరైన ట్రూత్ బ్రష్‌ను ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ మృదువైన ట్రూత్ బ్రష్‌ని ఉపయోగించాలి. కఠినమైనది కాదు. అలాగే చాలా మంది ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోముకుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకుంటున్నారా? మీకు ఈ అలవాటు లేకుంటే, వెంటనే ప్రారంభించడానికి ప్రయత్నించండి. ఉదయం పళ్లు తోముకోవడం కంటే రాత్రి భోజనం చేసిన తర్వాత పళ్లు తోముకోవడం చాలా ముఖ్యం.