ఐపిఎల్ 2021లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై పరాజయం పాలైంది. అయితే చెన్నై ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ మ్యాచ్ తర్వాత ఒక అమ్మాయికి ఉంగరం ఇచ్చి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు వారిద్దరి వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.
దీపక్ చాహర్ ప్రేయసి పేరు జయ భరద్వాజ్. ఈమె బిగ్ బాస్ 5, స్ప్లిట్స్‌విల్లా 2 ప్రోగ్రాంలో పాల్గొంది. అంతేకాదు నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ సోదరి. ఈ ఇద్దరి ప్రేమ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి.
ఐపిఎల్ 2021లో జయ, దీపక్‌తో ఉంది. అతడిని ప్రోత్సహించడానికి ఆమె యూఏఈకి వెళ్లింది. కానీ దీపక్ ఆమెకు ఊహించలేని సర్ప్రైజ్ ఇచ్చాడు.
జయ ఢిల్లీకి చెందినది. కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది. ఈ రోజు దీపక్ ఆమెకు రింగ్ ఇచ్చి తన ప్రేమను తెలియజేశాడు. అప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. రింగ్ ధరించిన తర్వాత ఆమె దీపక్‌ను కౌగిలించుకుంది.