- Telugu News Photo Gallery Cricket photos RCB Star Player Virat Kohli May Miss IPL 2024 Season, Says Reports
IPL 2024: ‘ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2024కి కోహ్లీ దూరం.!’
ఐపీఎల్ 2024 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు లీగ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం విరాట్ కోహ్లీ ఎప్పుడు పునరాగమనం చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు.
Updated on: Mar 03, 2024 | 6:30 PM

ఐపీఎల్ 2024 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు లీగ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం విరాట్ కోహ్లీ ఎప్పుడు పునరాగమనం చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దెబ్బకు బెంగళూరు ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేశాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల లండన్‌లో విరాట్ భార్య అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనించింది. ఈ క్రమంలోనే వ్యక్తిగత కారణాల వల్ల టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. దీనిపై స్పందించిన సునీల్ గవాస్కర్. కోహ్లీ ఐపీఎల్ ప్రదర్శనపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఇటీవల రాంచీలో జరిగిన స్టార్ స్పోర్ట్స్ ఈవెంట్‌కు గెస్ట్‌గా విచ్చేసిన సునీల్ గవాస్కర్.. కోహ్లీ అసలు ఐపీఎల్ ఆడతాడా.? ఈ టోర్నీ కూడా ఆడకపోవచ్చునని చెప్పాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెడుతున్న కోహ్లీ కసితో పరుగుల వరద పారిస్తాడా.? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్న అడగ్గా..

‘అసలు అతడు ఐపీఎల్ ఆడతాడా? కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పుడు ఆడట్లేదు. బహుశా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లోనూ ఆడకపోవచ్చు.’ అని సునీల్ గవాస్కర్ బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేశాయి. అయితే అదేం లేదని.. ఐపీఎల్ 2024 సీజన్ ఆర్సీబీ తొలి మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడని ఆ జట్టు డైహార్డ్ ఫ్యాన్స్ గట్టి ధీమాతో ఉన్నారు.




