- Telugu News Photo Gallery Cricket photos India New Test Captain: Team India odi and t20 captain Rohit Sharma set to named new test captain bcci selectors to talk on his fitness likley to announce after south africa odi series
Team India: టీమిండియా కొత్త టెస్టు సారథి ఫిక్స్.. వైస్ కెప్టెన్‌పైనే బీసీసీఐ తర్జనభర్జనలు.. పట్టాభిషేకం ఎప్పుడంటే?
India New Test Captain: వన్డే, టీ20 తర్వాత ప్రస్తుతం రోహిత్ శర్మ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా మారబోతున్నాడు. దక్షిణాఫ్రికాతతో వన్డే సిరీస్ తర్వాత హిట్‌మ్యాన్ పేరును ప్రకటింవచ్చని తెలుస్తోంది.
Updated on: Jan 17, 2022 | 4:10 PM

Rohit Sharma: విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న వెంటనే.. ఏ ఆటగాడికి జట్టు కమాండ్ ఇస్తారనే ప్రశ్న అభిమానులందరి మదిలో మెదులుతోంది. కొన్ని నివేదికలను విశ్వసిస్తే, బీసీసీఐ కొత్త టెస్ట్ కెప్టెన్‌ని ఇప్పటకే నిర్ణయించిందంట. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత అధికారిక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.

ఇన్‌సైడ్ రిపోర్ట్ ప్రకారం, రోహిత్ శర్మ కొత్త టెస్ట్ కెప్టెన్‌గా మారబోతున్నాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రస్తుతం విరాట్ రాజీనామా తర్వాత, హిట్‌మ్యాన్ జట్టు కమాండ్‌ను తీసుకుంటాడని తెలుస్తోంది.

అయితే, రోహిత్ శర్మను టెస్ట్ కెప్టెన్‌గా చేయడానికి ముందు, బీసీసీఐ కూడా అతనితో ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడుతోందంట. నివేదికల ప్రకారం, సెలెక్టర్లు పనిభారం, ఫిట్‌నెస్ సంబంధిత సమస్యలపై రోహిత్ శర్మతో మాట్లాడతారు. బీసీసీఐ అధికారి ప్రకారం, 'పని భారం చాలా ఎక్కువ. రోహిత్ శర్మ తనను తాను ఫిట్‌గా ఉంచుకోవాలి. సెలెక్టర్లు అతనితో మాట్లాడతారని, అతని ఫిట్‌నెస్‌పై అదనపు పని చేయాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాన్నట్లు' ఆయన తెలిపారు.

రోహిత్ శర్మ స్నాయువు గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంలో రెండుసార్లు దానికి బలి అయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ శర్మ గాయంతో టెస్ట్, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. అందుకే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించడం కూడా పెద్ద రిస్క్‌గా భావించవచ్చు.

రోహిత్ శర్మకు డిప్యూటీగా ఎవరనే అంశంపై బీసీసీఐ అధికారి కూడా ఓ పెద్ద విషయం ప్రకటించారు. బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, 'టీమ్ ఇండియా తదుపరి నాయకుడు వైస్ కెప్టెన్ అవుతాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా అందరూ భవిష్యత్ నాయకులు. జట్టుకు కొత్త వైస్ కెప్టెన్ ఎవరనే దానిపై సెలక్టర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.




