- Telugu News Photo Gallery Cricket photos IND vs WI india probable playing 11 for 1st test match against west indies
IND vs WI: విండీస్‌తో తొలి టెస్ట్.. అరంగేట్రంతో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ముగ్గురు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?
IND vs WI: జులై 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌లోని డొమినికాలో అదేరోజు తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.
Updated on: Jul 01, 2023 | 6:51 AM

జులై 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌లోని డొమినికాలో అదేరోజు తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈక్రమంలో వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టుకు బరిలోకి దిగే టీమిండియాప్లేయింగ్ 11పై ఉత్కంఠ నెలకొంది. జట్టును ఎంపిక చేయడం కెప్టెన్ రోహిత్ శర్మకు అంత సులభం కాదు. రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఓడిన భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్ తదుపరి ఎడిషన్‌లో విజయం సాధించాలంటే.. విజయాలు తప్పనిసరి. కాబట్టి, రోహిత్, ద్రవిడ్ వెంటనే బలమైన జట్టును నిర్మించాల్సిన అవసరం ఉంది.

ఇక జట్టు బ్యాటింగ్ విభాగాన్ని పరిశీలిస్తే రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు ఆడటం ఖాయమని చెప్పవచ్చు.

వికెట్ కీపింగ్ విభాగంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎస్ భరత్ వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ ఈ టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం పొందవచ్చు. కీపింగ్‌తో పాటు 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.

వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. అతనికి రవీంద్ర జడేజా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జడేజాను జట్టులోకి తీసుకుంటే అక్షర్ పటేల్ బెంచ్‌పై నిరీక్షించాల్సి ఉంటుంది.

బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, జయదేవ్ ఉనద్కత్‌లను కెప్టెన్ రోహిత్ ఛాన్స్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. శార్దూల్ ఠాకూర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోకపోవచ్చు.

తొలి టెస్టుకు భారత ప్రాబబుల్ ప్లేయింగ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, జయదేవ్ ఉనద్కత్.

టెస్టు సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సావి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.




