AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS Test: 8 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు.. భారత్‌పై ఆస్ట్రేలియాకు 62 ఏళ్ల చెక్కుచెదరని రికార్డు.. ఎవరి పేరిట ఉందంటే..

ఆస్ట్రేలియా బౌలర్లలో చాలా మంది భారత్‌లో పెద్దగా విజయం రాణించలేకపోయారు. అయితే ఒక ఆస్ట్రేలియన్ బౌలర్ మాత్రం భారత్‌పై ఎంతగా చెలరేగిపోయాడంటే.. 60 ఏళ్ల క్రితం అతని పేరిట నమోదైన రికార్డును ఇప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. మరి ఆ బౌలర్ ఎవరంటే..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 08, 2023 | 7:11 AM

Share
ఆస్ట్రేలియా  జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమవుతుంది. గత 75 ఏళ్లలోచాలా మంది ఆస్ట్రేలియన్ దిగ్గజ బౌలర్లు భారత్‌లో పర్యటించారు కానీ అందరూ పెద్దగా విజయం సాధించలేదు. గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్ వంటి వెటరన్ బౌలర్లు కూడా ఇక్కడ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే  62 ఏళ్లుగా కొనసాగుతున్న రిచి బెనౌ రికార్డు ఇంకా బద్దలవకపోవడానికి ఇదే కారణం.

1 / 6
భారత్‌లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్‌గా ఇదే రికార్డు. 1956 నుంచి 1960 మధ్యకాలంలో కేవలం 8 టెస్టుల్లో 56 వికెట్లు తీసిన కంగారూ దేశానికి చెందిన మాజీ వెటరన్ లెగ్ స్పిన్నర్ రిచీ బెనౌ పేరిట ఈ రికార్డు ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రికార్డు అలాగే కొనసాగుతోంది.

2 / 6
అతని తర్వాత నాథన్ లియాన్ రెండవ స్థానంలో ఉన్నాడు. లియాన్ కూడా ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో లియాన్‌కు రిచీ బెనౌ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. అయితే లియన్‌కు 7 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు మాత్రమే ఉండటంతో అది అంత సులువు కాదు.

3 / 6
మూడో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్రాహం మెకెంజీ ఉన్నాడు. అతను 1964 నుంచి 1969 వరకు 8 మ్యాచ్‌లలో 34 వికెట్లు తీసుకున్నాడు.

4 / 6
 గ్రేట్ లెగ్ స్పిన్నర్(స్పిన్ మాంత్రికుడు) షేన్ వార్న్ భారతదేశంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంకా చెప్పాలంటే అతనికి కూడా సులభంగా వికెట్లు పడలేదు. వార్న్ 9 మ్యాచ్‌లలోని 16 ఇన్నింగ్స్‌లలో 34 వికెట్లు పడగొట్టాడు. అయితే 43 సగటు, స్ట్రైక్ రేట్ 81, ఆస్ట్రేలియా టాప్ 5 బౌలర్‌లలో ఒకడిగా ఉన్నాడు.

5 / 6
2004లో ఆస్ట్రేలియా చివరిసారిగా భారత్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఆస్ట్రేలియన్ పేసర్ భారతదేశంలో 7 టెస్టుల్లో ఆడి 33 వికెట్లు తీయడమే కాక అతని అద్భుతమైన స్ట్రైక్ రేట్ 47,  సగటు 21.

6 / 6