15 ఏళ్లకే అరంగేట్రం.. సచిన్ రికార్డుకు బ్రేకులు.. కట్‌చేస్తే.. 19 ఏళ్లకే భారత్‌ను విశ్వ విజేతగా మార్చేందుకు అడుగుదూరంలో..

HBD Shafali Verma: అతిచిన్న వయస్సులో అంతర్జాతీయ స్థాయిలో బౌలర్లను చీల్చి చెండాదిన ఈ భారత బ్యాటర్.. తాజాగా టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చడానికి కేవలం ఒక అడుగు దూరంలో నిలిచింది.

|

Updated on: Jan 28, 2023 | 7:40 AM

సచిన్ టెండూల్కర్ చాలా చిన్న వయస్సులోనే అంతర్జాతీయ వేదికపై పేరు సంపాదించాడు. భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ 16 సంవత్సరాల వయస్సులో పాకిస్తాన్ భీకర బౌలింగ్ దాడిపై అరంగేట్రం చేశాడు. అంత చిన్న వయసులో సచిన్ పాక్ దిగ్గజాలను ఎలా ఎదుర్కొంటాడోనని అంతా ఆందోళన చెందారు. కానీ, అసాధ్యాన్ని, సుసాధ్యం చేసి చూపించాడు సచిన్.

1 / 6
షెఫాలీ వర్మ 15 ఏళ్ల వయసులో భారత మహిళల జట్టులోకి అడుగుపెట్టినప్పుడు కూడా అచ్చం అలాంటిదే జరిగింది. అయితే క్రికెట్ మైదానంలో వయస్సు పట్టింపు లేదని షెఫాలీ మరోసారి నిరూపించింది. ఎన్నో రికార్డును తన పేరున లిఖించుకుంది. ఈరోజు షెఫాలీ పుట్టినరోజు. షెఫాలీ 28 జనవరి 2004న హర్యానాలోని రోహ్‌తక్‌లో జన్మించింది.

2 / 6
ఈ బ్యాట్స్‌మెన్ అతి చిన్న వయసులోనే అరంగేట్రం చేసి అనతికాలంలోనే పేరు సంపాదించింది. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తో షెఫాలీని లేడీ వీరేంద్ర సెహ్వాగ్ అని పిలవడం ప్రారంభించారు. సెహ్వాగ్ తన తుఫాను బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. షెఫాలీ కూడా అదే తరహాలో బౌలర్లపై విరుచుకపడుతుంటుంది.

3 / 6
సెహ్వాగ్ స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ సచిన్ రికార్డును షెఫాలీ బద్దలు కొట్టింది. ఈ బ్యాట్స్‌మన్ 9 నవంబర్ 2019న వెస్టిండీస్‌పై 42 బంతుల్లో 73 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో సచిన్‌ను వెనక్కునెట్టింది. షెఫాలీ కెరీర్‌లో ఇది ఐదో అంతర్జాతీయ మ్యాచ్. ఈ సమయంలో ఆమె వయస్సు 15 సంవత్సరాల 285 రోజులు మాత్రమే. వెస్టిండీస్‌పై హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా షఫాలీ నిలిచింది. ఆమెకు ముందు ఈ రికార్డు 16 ఏళ్ల 214 రోజుల వయసులో పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ చేసిన సచిన్ పేరిట ఉంది.

4 / 6
షెఫాలీ తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడడం ద్వారా దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చాటింది. ఫిబ్రవరి 2019లో, హర్యానా తరపున ఆడుతూ కేవలం 56 బంతుల్లో 128 పరుగులు చేసింది. టీ20 మ్యాచ్‌లో ఆమె ఈ ఇన్నింగ్స్ ఆడింది. ఇక్కడి నుంచి ఈ ఏడాది టీ20 ఛాలెంజ్‌లో వెలాసిటీ టీమ్‌లోకి వచ్చి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చింది.

5 / 6
షెఫాలీ ఆట ఎంతగా అభివృద్ధి చెందిందంటే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచ కప్ కోసం బీసీసీఐ టీమిండియాకు కమాండ్‌ని అప్పగించింది. వచ్చిన అవకాశాన్ని నిరాశపరచకుండా తన అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును ఫైనల్స్‌కు చేర్చింది. జనవరి 29న ఇంగ్లండ్‌తో ఫైనల్ ఆడనున్న భారత్.. శుక్రవారం న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇదే ఊపుతో ప్రపంచకప్‌ను గెలుచుకుని దేశం గర్వించేలా చేస్తుందని అంతా భావిస్తున్నారు.

6 / 6
Follow us
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు