- Telugu News Photo Gallery Cricket photos From Shubman gill to Travis head these 5 batsmens scored the most runs in international cricket in 2023
Cricket Records: అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొట్టిన బ్యాటర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే..
Most International Runs In 2023: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2023లో కేవలం 36 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. ఈసారి 8 భారీ సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. దీంతో గతేడాది అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను టీమిండియా ఆటగాళ్లు కైవసం చేసుకోవడం విశేషం.
Updated on: Jan 07, 2024 | 12:47 PM

2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను టీమిండియా ఆటగాళ్లు కైవసం చేసుకోవడం విశేషం. అయితే, గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ ఎవరో చూద్దాం..

1- శుభ్‌మన్ గిల్: భారత జట్టు యువ ఓపెనర్ గతేడాది మొత్తం 52 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి 7 సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో మొత్తం 2154 పరుగులు చేసి 2023లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

2- విరాట్ కోహ్లీ: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2023లో 36 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి 8 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు చేశాడు. దీంతో అతను మొత్తం 2048 పరుగులు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

3- డారిల్ మిచెల్: న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ గతేడాది 55 ఇన్నింగ్స్‌లు ఆడి 6 సెంచరీలు, 9 అర్ధసెంచరీలతో 1989 పరుగులు చేశాడు.

4- రోహిత్ శర్మ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2023లో 39 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. ఈసారి 4 సెంచరీలు, 11 అర్ధసెంచరీలతో మొత్తం 1800 పరుగులు చేశాడు.

5- ట్రావిస్ హెడ్: ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ గతేడాది 42 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి 3 సెంచరీలు, 9 అర్ధసెంచరీలతో మొత్తం 1698 పరుగులు చేశాడు.





























