- Telugu News Photo Gallery Team India Player Rishabh Pant’s Sister Sakshi Gets Engaged To Ankit Chaudhary photos goes viral
Rishabh Pant: సోదరి నిశ్చితార్థంలో మెరిసిన రిషబ్ పంత్.. నెట్టింట్లో ఫొటోస్ వైరల్..
Rishabh Pant: గత ఏడాది కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఈ ఐపీఎల్ ద్వారా పునరాగమనం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమన్న నమ్మకంతో ఉన్నాడు. ఈ మేరకు ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ పెళ్లికి సిద్ధమైంది. తొలి అడుగుగా ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది.
Updated on: Jan 07, 2024 | 12:30 PM

టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ పెళ్లికి సిద్ధమైంది. తొలి అడుగుగా ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది.

సాక్షి పంత్ తన చిరకాల ప్రియుడు అంకిత్ చౌదరితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ హ్యాపీ అవర్ ఫొటోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

రిషబ్ పంత్ తన సోదరి నిశ్చితార్థం కోసం నల్ల కోటు, ప్యాంటు ధరించగా, అతని సోదరి లేత గులాబీ రంగు లెహంగాలో అబ్బురపరిచింది. అలాగే, అంకిత్ చౌదరి కుర్తా పైజామాలో కనిపించాడు.

అంకిత్ చౌదరితో నిశ్చితార్థం చేసుకున్న ఫొటోను సాక్షి పోస్ట్ చేసి, 'ఇదిగో మన ప్రేమకథలో కొత్త అధ్యాయం...' అంటూ షేర్ చేసింది.

సాక్షి పంత్, అంకిత్ చౌదరి ఒకరికొకరు 9 సంవత్సరాలుగా తెలుసు. ఇద్దరూ లండన్‌లో ఉంటున్నారు. అంకిత్ లండన్ వెళ్లే ముందు అమిటీ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసింది. అలాగే సాక్షి పంత్ కూడా యూకేలో విద్యాభ్యాసం పూర్తి చేసింది.

ఇప్పుడు అంకిత్, సాక్షి పెళ్లి చేసుకోబోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం నిశ్చితార్థం ముగిసిందని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలిసింది. రిషబ్ కంటే సాక్షి పంత్ రెండేళ్లు పెద్ద. అందుకు తగ్గట్టుగానే తన సోదరి పెళ్లి బాధ్యతలు తీసుకున్న పంత్.. నిశ్చితార్థ వేడుకను ఘనంగా జరిపించాడు. ఈ శుభ కార్యక్రమంలో రిషబ్ పంత్ సన్నిహిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





























