T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ లిస్టులో 30 మంది ఆటగాళ్లు.. జాబితాలో రోహిత్, కోహ్లీ..

|

Jan 03, 2024 | 3:02 PM

T20 World Cup 2024: బీసీసీఐ ఎంపిక చేయనున్న 25 నుంచి 30 మంది ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు కూడా ఉంటాయని సమాచారం. టీ20 జట్టు ఎంపిక కోసం ఈ ఇద్దరు ప్రముఖులను కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి, కింగ్ కోహ్లి, హిట్‌మాన్ పునరాగమనాన్ని ఆశించవచ్చు.

1 / 5
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ప్రారంభానికి కేవలం నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, ఈమధ్యలో టీమిండియా ముందు కేవలం 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌ల ద్వారా టీ20 ప్రపంచకప్‌‌నకు బలమైన జట్టును ఏర్పాటు చేయడం కష్టం. అందుకే బీసీసీఐ ఇప్పుడు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది.

2 / 5
ఈ ప్లాన్ ప్రకారం వచ్చే ఐపీఎల్‌లో 25 నుంచి 30 మంది భారత ఆటగాళ్లపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచుతుంది. వీరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 16 మంది ఆటగాళ్లను టీ20 ప్రపంచకప్‌ బరిలో నిలిచే భారత జట్టును ఎంపిక చేస్తారు.

3 / 5
దీని ప్రకారం, T20 ప్రపంచ కప్ కోసం 25 నుంచి 30 మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఈ ఆటగాళ్ల ప్రదర్శన IPL ఆధారంగా తేల్చనున్నారు. ఈసారి అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుంటారని చెప్పొచ్చు.

4 / 5
బీసీసీఐ ఎంపిక చేయనున్న 25 నుంచి 30 మంది ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు కూడా ఉంటాయని సమాచారం. టీ20 జట్టు ఎంపిక కోసం ఈ ఇద్దరు ప్రముఖులను కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి, కింగ్ కోహ్లి, హిట్‌మాన్ పునరాగమనాన్ని ఆశించవచ్చు.

5 / 5
ఈసారి టీ20 ప్రపంచకప్ జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. అంటే IPL ముగిసిన వెంటనే USA-వెస్టిండీస్‌లో T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. అందువల్ల, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఐపీఎల్ ప్రదర్శనను బెంచ్‌మార్క్‌గా ఉపయోగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. దీని ప్రకారం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.