నిన్నమొన్నటి వరకు అలా.. ఇప్పుడు ఇలా.. తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ బ్యూటీస్

Edited By: Phani CH

Updated on: Apr 09, 2025 | 7:02 PM

ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడెలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. అందుకే ఎవరినీ తక్కువంచనా వేయకూడదు. కావాలంటే చూడండి.. నిన్నమొన్నటి వరకు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, టీవీలో యాంకరింగ్ చేసుకున్న వాళ్లే ఇప్పుడు హీరోయిన్లుగా వచ్చేస్తున్నారు.. టాలెంట్ చూపించడానికి రెడీ అవుతున్నారు. మరి ఎవరా హీరోయిన్లు ఓసారి చూద్దామా..?

1 / 5
ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు ఎలా బ్రేక్ వస్తుందో చెప్పలేం..? బేబీ అనే ఒక్క సినిమాతో వైష్ణవి చైతన్య జాతకమే మారిపోయింది. అప్పటి వరకు యూ ట్యూబ్‌లో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే ఈమె.. బేబీతో హీరోయిన్ అయిపోయారు.

2 / 5
ఆ హిట్టుతో వరస ఛాన్సులు అందుకున్నారు. ప్రస్తుతం జాక్‌తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. తమిళం నుంచి కూడా వైష్ణవి చైతన్యకు అవకాశాలు వస్తున్నాయిప్పుడు.

3 / 5
అలాగే దేత్తడి హారిక కూడా ఇప్పుడో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బేబీ సినిమా టీం సాయి రాజేష్, SKN కలిసి హారికను హీరోయిన్‌గా లాంఛ్ చేస్తున్నారు. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు.

4 / 5
ఇక యాంకర్ దీపిక పిల్లి సైతం తాజాగా ప్రదీప్ సినిమాతో హీరోయిన్ అయిపోయారు. యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో హీరోయిన్‌గా నటిస్తున్నారు దీపిక పిల్లి.

5 / 5
ఈ సినిమాకి నితిన్ భరత్ దర్శకులు. ఏప్రిల్ 11న విడుదల కానుంది ఈ చిత్రం. పైగా వీళ్ళంతా తెలుగు అమ్మాయిలే కావడం విశేషం. మొత్తానికి యూ ట్యూబ్ నుంచి నేరుగా వెండితెరపై వెలిగిపోవడానికి వచ్చేస్తున్నారు ఈ బ్యూటీస్.