ఉమెన్స్ డే స్పెషల్.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొట్టిన బ్యూటీస్ వీరే!

Edited By: TV9 Telugu

Updated on: Mar 07, 2025 | 12:35 PM

చాలా మంది హీరోయిన్స్ తమ నటనతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నారు. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో హీరోల మాదిరి యాక్షన్ సీనిమాలు చేసి తమ సత్తాచాటారు. ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డ్స్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
విజయశాంతి : టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఓసేయ్ రాములమ్మ చిత్రంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ నటి. ఇప్పటికీ విజయ్ శాంతికంటే ఓసేయ్ రాములమ్మ అంటేనే చాలా మంది ఈ హీరోయిన్‌ను గుర్తుపడుతారు అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది.

2 / 5
అనుష్క శెట్టి : అరుంధతి సినిమాతో టాలీవుడ్‌నే షేక్ చేసిన ముద్దుగుమ్మ అనుష్క. ఈ అమ్మడు ఒకప్పుడు వరస సినిమాలతో తెలుగు చిత్రపరిశ్రమలో తన మార్క్ చూపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఘాటీ చిత్రంతో అభిమానుల ముందుకురానుంది.

3 / 5
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంది మహిళలకు ఈ నటి ఆదర్శం. ఇక తన నటనతో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ యశోద సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.

4 / 5
నయనతార : లేడీ సూపర్ స్టార్ నయనతార తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది. ఈ అమ్మడు ఏసినిమాలోనైనా ఇట్టే ఒదిగిపోతుంది. ఈ హీరోయిన్ అనామిక, ఐరా, కర్తవ్యం వంటి సినిమాల ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది.

5 / 5
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన గార్గి లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది.