
పెద్ద రేంజ్‌కి వెళ్లాలంటే, వేసే స్టెప్పులు కూడా భారీగానే ఉండాలనే విషయాన్ని బాగా బట్టీ పట్టేసినట్టున్నారు తేజ సజ్జా. ఈ ఏడాది వర్కవుట్ అయిన ఓ విషయం, వచ్చే ఏడాదిలోనూ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. అందుకే డేరింగ్‌గా ఓ స్టెప్ వేసస్తున్నారు....

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమా వచ్చే ఏడాది వేసవి మీద ఖర్చీఫ్ వేసింది. తేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న 2డీ, త్రీడీల్లో మిరాయ్‌ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.

సూపర్ యోధ మిరాయ్ రిలీజ్‌కి... బిఫోర్ వీక్ విడుదలవుతోంది డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజాసాబ్‌ని రిలీజ్ చేస్తామంటూ డిక్లేర్ చేశారు మేకర్స్. ఆల్రెడీ ఈ ఏడాది వెయ్యి కోట్లు కొల్లగొట్టిన డార్లింగ్‌కి రాజా సాబ్ సరికొత్త జోనర్ మూవీ అవుతుందనే టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది.

అటు యష్ మూవీ టాక్సిక్ కూడా రాజా సాబ్ వచ్చే డేట్‌కే వస్తోంది. ప్యాన్ ఇండియా లెవల్లో టాక్సిక్‌కి మంచి డిమాండ్ ఉంది. కేజీయఫ్ సీరీస్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరగవచ్చనే అంచనాలున్నాయి.

ఎన్ని సినిమాలు వస్తేనేం... నా రాక నాదే అనే ధోరణి కనిపిస్తోంది తేజ సజ్జాలో. మరి టాక్సిక్, రాజా సాబ్‌ని దాటి మిరాయ్‌కి థియేటర్లు దొరుకుతాయా? అసలేం జరగబోతోంది? లెట్స్ వెయిట్ అండ్ సీ....