
హనుమాన్ సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన ప్రశాంత్ వర్మ, తాజాగా మరో ప్రకటన చేశారు. తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌లో మూడు ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నట్టుగా ఎనౌన్స్ చేశారు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

అ!, కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ, హనుమాన్ సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారారు. కంట్రోల్డ్ బడ్జెట్‌లో భారీ గ్రాఫికల్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా హోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయారు ప్రశాంత్ వర్మ.

హనుమాన్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా అధీరా అనే ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేశారు. స్టార్ కిడ్ కల్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు.

హనుమాన్ సినిమా రిలీజ్ టైమ్‌కు ఇదే యూనివర్స్ నుంచి హనుమాన్‌కు సీక్వెల్‌గా జై హనుమాన్ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. దీంతో పీవీసీయూలో థర్డ్ మూవీ జై హనుమానే అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. కానీ ఈ మధ్య బాలయ్య వారసుడ్ని వెండితెరకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్న ప్రశాంత్ వర్మ, త్వరలోనే ఆ సినిమా స్టార్ట్ అవుతుందని ఎనౌన్స్ చేశారు.

తాజాగా పీవీసీయు 3 ఎనౌన్స్‌మెంట్ గురించి హింట్ ఇవ్వటంతో అది ఏ ప్రాజెక్ట్ అన్న చర్చ జరుగుతోంది. నందమూరి మోక్షజ్ఞ సినిమా గురించే క్లారిటీ ఇస్తారా.? లేదంటే ముందు నుంచి అనుకుంటున్నట్టుగా జై హనుమాన్‌ను పట్టాలెక్కిస్తారా..? ఈ రెండు కాదని మరో మూవీని ఎనౌన్స్ చేస్తారా..? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.