- Telugu News Photo Gallery Cinema photos Who will win the competition between them again after 5 years?
Sankranthi Movies: 5 ఏళ్ల తర్వాత మళ్లీ వీరి మధ్య పోటీ.. ఈసారి గెలుపు ఎవరిది.?
నవంబర్ సినిమాలన్నీ స్పీడు స్పీడుగా థియేటర్లలోకి దూకేసి, ప్లేస్ ఫిల్ చేసేస్తున్నాయి. అటు డిసెంబర్ సినిమాలు కూడా ప్రమోషన్ల జోరు పెంచేశాయి. ఈ వేడిమీదే సంక్రాంతి సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు. పొంగల్ రేసులో ఉన్న హీరోల గురించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రీకాల్ చేసుకుంటున్నారు.
Updated on: Nov 17, 2024 | 3:08 PM

బాలయ్య, వెంకీతో 2019లో వినయవిధేయరామతో పోటీపడ్డ అనుభవం కూడా ఉంది రామ్‌చరణ్‌కి. అప్పుడు చేదు అనుభవం ఎదురైంది. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడితో బాలయ్య మెప్పించారు. అదే సంక్రాంతికి ఎఫ్2 హిట్ కొట్టారు వెంకీ. మళ్లీ 5 ఏళ్ల తర్వాత 2025 సంక్రాంతికి పోటీ పడుతున్నారు. ఇప్పుడు తీపి కబురు అందుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ...

సంక్రాంతికి జనవరి 10న వచ్చేస్తున్నాం జరగండి జరగండి అంటు గేమ్ గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చేస్తున్నారు రామ్‌చరణ్. ఈ సారి ఆయన బాలయ్య, వెంకటేష్, అజిత్‌తో పోటీపడబోతున్నారు.

2019లో ఎన్టీఆర్ కథానాయకుడితో ప్రేక్షకులను పలకరించారు నందమూరి బాలకృష్ణ. 2025లో ఎన్బీకే 109తో ఆడియన్స్ కి హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు జనాలు.

వెంకీ - అనిల్. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్2... 2019లో బాలయ్య, చెర్రీకి మంచి పోటీనిచ్చింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి సెలబ్రేషన్స్ తెచ్చిపెడుతుందో చూడాలి.

అటు అజిత్ తన గుడ్ బ్యాడ్ అగ్లీతో 2025 సంక్రాంతికి రెడీ అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌తోనే తమను తాము మరో సారి ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడుతున్నారు.




