
ఈ ఏడాది సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సిన విశ్వంభర వాయిదా పడటంతో కొత్త రిలీజ్ డేట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు.

ఇన్నాళ్లు యూనిట్ నుంచి ఒక్క అప్‌డేట్ కూడా లేకపోవటంతో అసలు సినిమా స్టేటసేంటి? రిలీజ్ ఎప్పుడుంటుంది అన్న టెన్షన్ కనిపించింది.ఫైనల్‌గా మెగా కాంపౌండ్ నుంచి ఫస్ట్ అప్‌డేట్ వచ్చింది.

హనుమజ్జయంతి సందర్భంగా శ్రీరామ కళ్యాణం సందర్భంగా వచ్చే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట రిలీజ్ తరువాత ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగాయి.

ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెంచే అప్‌డేట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్‌కు సంబంధించిన న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాకు గ్రాఫిక్స్ కోసమే 75 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారట మేకర్స్.

ఈ నెంబర్స్ చూశాక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ రేంజ్ బడ్జెట్ కేవలం గ్రాఫిక్స్ కోసమే కేటాయించటంతో అవుట్‌పుట్ విషయంలోనూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.