- Telugu News Photo Gallery Cinema photos Vijay Sethupathi Reveals Why he Choose To do a film with Puri Jagannadh
Vijay Sethupathi: రిస్క్ చేసేందుకు నేను రెడీ.. పూరీని సపోర్ట్ చేసిన విజయ్ సేతుపతి
ప్రజెంట్ పూరి గ్రాఫ్ అంత బాగాలేదు. ఈ టైమ్‌లో ఓ స్టార్ హీరో పూరీకి డేట్స్ ఇవ్వటం అంటే రిస్క్ చేయటమే అనుకుంటారు. కానీ అలాంటి రిస్క్ చేసేందుకు రెడీ అయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. తాను సినిమా ఒకే చేసేటప్పుడు ఆ దర్శకుడు గ్రాఫ్ పట్టించుకోనంటున్నారు మక్కల్ సెల్వన్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు ఒకే చెప్పారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.
Updated on: Apr 16, 2025 | 8:00 PM

ప్రజెంట్ పూరి గ్రాఫ్ అంత బాగాలేదు. ఈ టైమ్‌లో ఓ స్టార్ హీరో పూరీకి డేట్స్ ఇవ్వటం అంటే రిస్క్ చేయటమే అనుకుంటారు. కానీ అలాంటి రిస్క్ చేసేందుకు రెడీ అయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. తాను సినిమా ఒకే చేసేటప్పుడు ఆ దర్శకుడు గ్రాఫ్ పట్టించుకోనంటున్నారు మక్కల్ సెల్వన్.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు ఒకే చెప్పారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. అయితే ప్రజెంట్ పూరీ ఉన్న సిచ్యుయేషన్‌లో విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో సినిమా ఓకే చేయటం మీద ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ చర్చ జరిగింది.

ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు మక్కల్ సెల్వన్. సినిమా ఓకే చేసేటప్పుడు దర్శకుడి గ్రాఫ్‌ను తాను అస్సలు పట్టించుకోనన్నారు సేతుపతి. కథ, దర్శకుడి కమిట్మెంట్ నచ్చితే ఆ సినిమా ఓకే చేస్తానని చెప్పారు.

పూరి విషయంలోనూ అలాగే నిర్ణయం తీసుకున్నా అన్నారు విజయ్ సేతుపతి. పూరి చెప్పిన కథ తనకు ఎంతో నచ్చిందని, ఇంత వరకు అలాంటి క్యారెక్టర్ చేయలేదని అందుకే ఆ ప్రాజెక్ట్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చా అన్నారు.

కొత్త కథలు, చాలెంజింగ్ రోల్స్ చేయటం తనకు ఎంతో ఇష్టమన్న సేతుపతి, పూరి అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చారన్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభించేందుకు రెడీ అవుతోంది పూరీ టీమ్.




