
రీసెంట్ ఇంటర్వ్యూలో తన అప్ కమింగ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు వర్సటైల్ స్టార్ విజయ్ సేతుపతి. సాధారణంగా స్టార్ హీరో తన సినిమా అప్‌డేట్ ఇస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు. కానీ మక్కల్ సెల్వన్ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఖుషీ అవ్వకపోగా... డైలమాలో పడిపోయారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా జర్నీ మొదలు పెట్టి కోలీవుడ్‌లో స్టార్ హీరో రేంజ్‌కు వచ్చారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. హీరోగా వరుస అవకాశాలు వస్తున్నా... విలన్‌గా, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ తన వర్సటైల్ ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారు. ప్రజెంట్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు విజయ్.

విడుదలై పార్ట్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్న విజయ్ సేతుపతి ఆ సినిమాలో తన క్యారెక్టర్, షూటింగ్ షెడ్యూల్స్‌కు సంబంధించిన విశేషాలు రివీల్ చేశారు. తొలి భాగం సైన్ చేసినప్పుడు కేవలం 8 రోజుల షూటింగ్ మాత్రమే అని చెప్పిన దర్శకుడు ఇప్పుడు సీక్వెల్ షూటింగ్ వంద రోజుల నుంచి జరుగుతున్నా ఇంకా పూర్తి చేయలేదన్నారు.

విడుదలై ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించింది. అందుకే సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు వెట్రిమారన్. ముందు అనుకున్న కథకు మార్పులు చేసి విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను పెంచి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. అందుకే షూటింగ్ ఆలస్యమవుతోందన్నది యూనిట్ సైడ్ నుంచి వినిపిస్తున్న వర్షన్.

కంటెంట్ సంగతి ఎలా ఉన్నా...? వంద రోజుల పాటు విజయ్ సేతుపతి లాంటి బిగ్ స్టార్‌ను వంద రోజుల పాటు బ్లాక్ చేయటం విషయంలోనే ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మరి ఇప్పటికైనా విజయ్ సేతుపతిని వెట్రిమారన్ వదిలిపెడతారేమో చూడాలి.