- Telugu News Photo Gallery Cinema photos Vijay Devarakonda to Samantha latest cinema updates Tollywood film industry
Telugu Films: మాస్ కెప్టెన్‌తో విజయ్.? సమంత పూర్తిగా సెట్ అయినట్టేనా.?
తెలుగులో ఊరమాస్ డైరక్టర్ ఎవరని, ఎవరిని అడిగినా బోయపాటి శ్రీను పేరు ఇట్టే చెప్పేస్తారు. కంటెంట్‌లో ఇంటెన్సిటీ, హీరో కటౌట్‌లో ఎలివేషన్, మాటల్లో పదును, చేతిలో సరికొత్త ఆయుధం, మాస్ ఫార్ములాకు సిసలైన అర్థాలు చెబుతాయి ఆయన సినిమాలు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో చేస్తున్నారు విజయ్ దేవరకొండ. సమంతకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? ఆమె మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టేనా? ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Updated on: Feb 14, 2024 | 3:28 PM

తెలుగులో ఊరమాస్ డైరక్టర్ ఎవరని, ఎవరిని అడిగినా బోయపాటి శ్రీను పేరు ఇట్టే చెప్పేస్తారు. కంటెంట్‌లో ఇంటెన్సిటీ, హీరో కటౌట్‌లో ఎలివేషన్, మాటల్లో పదును, చేతిలో సరికొత్త ఆయుధం, మాస్ ఫార్ములాకు సిసలైన అర్థాలు చెబుతాయి ఆయన సినిమాలు.

అలాగని ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ కంటెంట్ ఉండదని అనుకోకూడదు. అన్ని రకాల ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతారు కాబట్టే, ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి రెడీ అని విజయ్ దేవరకొండ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్‌లో సినిమా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. లైగర్ తర్వాత మరో మాస్ ఫార్ములాకు ఓటేశారన్నమాట రౌడీ హీరో!

సమంతకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? ఆమె మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టేనా? ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాజ్ అండ్ డీకే డైరక్షన్‌లో ఫ్యామిలీమేన్3 షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానుంది. తన ఇమీడియేట్ వెంచర్ అదేనని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు ప్రియమణి.

ఫ్యామిలీమేన్2లో సత్తా చాటిన సమంత కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవుతారా? లేకుంటే మరికొన్నాళ్లు గ్యాప్ తీసుకుని, నెక్స్ట్ షెడ్యూల్స్ మీద ఫోకస్ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ ఇదే డైరక్టర్లతో సమంత చేసిన సిటాడెల్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.




