- Telugu News Photo Gallery Cinema photos Vijay Devarakonda and mrunal thakur movie Family Star director of parasuram release date announcement Telugu Entertainment Photos
Family Star: ఫ్యామిలీ స్టార్ గా వస్తున్న రౌడీ హీరో..! మాస్ యాంగిల్ కూడా అదుర్స్..
ఖుషితో మరోసారి ఫ్యామిలీ జోనర్‌లోకి వచ్చేసారు విజయ్ దేవరకొండ. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఈయనకు కాస్తో కూస్తో ఊపిరి ఊదింది ఈ చిత్రం. ఇదే దారిలో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ వచ్చేస్తున్నారు. తాజాగా టీజర్ విడుదలైంది. మరి ఇదెలా ఉంది.. గీతా గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందా..? క్లాస్‌తో పాటు మాస్‌ను అలరిస్తుందా..? ఫ్యామిలీ స్టార్ టీజర్ రివ్యూ చూద్దాం.. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండలో బాగా గట్టి మార్పులే కనిపిస్తున్నాయి.
Updated on: Oct 20, 2023 | 8:33 AM

ఖుషితో మరోసారి ఫ్యామిలీ జోనర్‌లోకి వచ్చేసారు విజయ్ దేవరకొండ. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఈయనకు కాస్తో కూస్తో ఊపిరి ఊదింది ఈ చిత్రం. ఇదే దారిలో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ వచ్చేస్తున్నారు.

తాజాగా టీజర్ విడుదలైంది. మరి ఇదెలా ఉంది.. గీతా గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందా..? క్లాస్‌తో పాటు మాస్‌ను అలరిస్తుందా..? ఫ్యామిలీ స్టార్ టీజర్ రివ్యూ చూద్దాం.. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండలో బాగా గట్టి మార్పులే కనిపిస్తున్నాయి.

దాని దెబ్బకు యాక్షన్ సినిమాలకు దూరమయ్యారో లేదంటే తనకు అచ్చొచ్చిన జోనర్‌లో ఒకట్రెండు హిట్లు కొట్టాక మళ్లీ మాస్‌పై ఫోకస్ చేయాలనుకుంటున్నారో తెలియడం లేదు కానీ ఏదేమైనా విజయ్‌లో మార్పైతే నిజం.

తాజాగా పరశురామ్ సినిమాకు ఫ్యామిలీ స్టార్ టైటిల్ కన్ఫర్మ్ చేసారు. చూస్తున్నారుగా.. ఇటు క్లాస్, అటు మాస్ ఆడియన్స్‌ను ఒకేసారి కవర్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా ఇంటి పనులు చేస్తూ.. అటు అభిమానులు కోరుకునే యాక్షన్ మిస్ కాకుండా టీజర్‌ను పర్ఫెక్టుగా కట్ చేసారు దర్శకుడు పరశురామ్.

రేపు సినిమాలోనూ క్లాస్ మాస్ రెండూ ఉంటాయంటున్నారీయన. టీజర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. టీజర్‌లో రెండు డైలాగ్స్ అదిరిపోయాయి. పరశురామ్ బేసిగ్గానే తన హీరోలను మాసీగా చూపిస్తుంటారు.

విజయ్‌లోని మాస్ యాంగిల్‌ను ఇలా వాడుకున్నారు ఈ దర్శకుడు. గీతా గోవిందంలో పూర్తిగా క్లాస్ చూపించిన ఈయన.. ఈ సారి క్లాస్ ప్లస్ మాస్ తెస్తున్నారు. చివర్లో మృణాళ్‌తో రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. చూడాలిక.. గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో..?




