- Telugu News Photo Gallery Cinema photos Venkatesh Guest Role For chiranjeevi Anil Ravipudi Upcoming Movie
మెగా సంక్రాంతికి హిట్ ఫార్ములా.. అంతకు మించి అనేలా ఉండబోతున్న సినిమా
విశ్వంభర్ సినిమా ఫినిష్ కాకముందే మరో మూవీని పట్టాలెక్కించారు మెగాస్టార్ చిరంజీవి. సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కెప్టెన్సీలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ అభిమానులను ఖుషీ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబో అన్నప్పుడే సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Apr 16, 2025 | 9:00 PM

మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబో అన్నప్పుడే సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. ముఖ్యంగా అనిల్ ఫామ్ చూసి మెగా ఫ్యాన్స్ ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు.

వెంకటేష్‌తో వందకోట్ల సినిమా చేసిన అనిల్, చిరుతో అంతకు మించి సక్సెస్‌ను కొట్టడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు.ఫ్యాన్స్ జోష్‌ను మరింత పెంచేలా చిరు సినిమా గురించి హింట్స్ ఇచ్చారు అనిల్ రావిపూడి.

ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్‌ను చూడబోతున్నారని, చాలా ఏళ్లుగా మిస్ అవుతున్న చిరు కామెడీ టైమింగ్‌ను ఈ సినిమాలో పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేయబోతున్నామని చెప్పారు. ఈ అప్‌డేట్స్‌తో మెగా ఫ్యాన్స్ జోష్ డబుల్ అయ్యింది. ఇప్పుడు అంతకు మించి సెలబ్రేషన్స్‌కు క్లూ ఇచ్చింది అనిల్ టీమ్.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విక్టరీ వేడుకలో అభిమానులకు ఓ ప్రామిస్ చేశారు హీరో వెంకటేష్. మళ్లీ సంక్రాంతికి వస్తాం కాకపోతే 2027లో అంటూ మాట ఇచ్చారు. అయితే ఆ మాటను ఇంకా ముందుగానే నిలబెట్టుకోబోతున్నారు విక్టరీ హీరో. చిరు హీరోగా అనిల్ తెరకెక్కిస్తున్న సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేయబోతున్నారు.

వెంకటేష్, అనిల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం 2025 సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది. ఈ సక్సెస్‌ను రిపీట్ చేసేందుకు నెక్ట్స్ సంక్రాంతికి కూడా వెంకీని తోడు తీసుకొని వస్తున్నారు అనిల్. మెగా మూవీలో వెంకీ నటిస్తున్నారన్న న్యూస్ బయటకు రావటంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.





























