- Telugu News Photo Gallery Cinema photos Actress simran choudhary shares her latest Teach For Change event photos
Simran Choudhary: కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెడుతున్న యంగ్ బ్యూటీ సిమ్రాన్ చౌదరి
సిమ్రాన్ చౌదరి .. ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత నటిగా మారింది. తెలుగులో ఎక్కువగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వయ్యారి భామ 1996లో హైదరాబాద్‌లో జన్మించింది.హైదరాబాద్‌లోని డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పదో తరగతి, సెంట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్‌లో డిగ్రీ పూర్తిచేసింది. సిమ్రాన్ 12 ఏళ్ల వయస్సులో కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ప్రారభించింది.
Updated on: Apr 17, 2025 | 1:59 PM

సిమ్రాన్ చౌదరి .. ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత నటిగా మారింది. తెలుగులో ఎక్కువగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వయ్యారి భామ 1996లో హైదరాబాద్‌లో జన్మించింది.

హైదరాబాద్‌లోని డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పదో తరగతి, సెంట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్‌లో డిగ్రీ పూర్తిచేసింది. సిమ్రాన్ 12 ఏళ్ల వయస్సులో కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ప్రారంభించి, తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది.

2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్‌తో పాటు టాలీవుడ్ మిస్ హైదరాబాద్, మిస్ టాలెంటెడ్ వంటి టైటిళ్లను గెలుచుకుంది. సినిమా రంగంలో ఆమె 2014లో "హమ్ తుమ్" అనే తెలుగు చిత్రంతో డెబ్యూ చేసింది.

ఆ తర్వాత "ఈ నగరానికి ఏమైంది" (2018) సినిమాతో ఆమె గుర్తింపు పొందింది, ఈ చిత్రంలో ఆమె అందం, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇతర గుర్తించదగిన చిత్రాలలో "బొమ్మ భాట్" (2020), "చెక్" (2021), "అథర్వ" (2023) ఉన్నాయి. "అథర్వ" సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సిమ్రాన్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది, ఇవి తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




