- Telugu News Photo Gallery Cinema photos Actress ashika ranganath shared her latest glamorous photos on instagram
అందాల ఆషికా రంగనాథ్.. అటు చీరకట్టులో క్లాస్.. ఇటు మోడ్రన్ డ్రస్సులో మాస్
ఆషికా రంగనాథ్ ఎక్కువగా కన్నడ సినిమాల్లో నటిస్తూ పాపులర్ అయ్యింది. ఆతర్వాత తెలుగు, తమిళ చిత్రాలలో కూడా కనిపించింది. ఈముద్దుగుమ్మ 1996 ఆగస్టు 5న కర్ణాటకలోని తుమకూరులో రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు జన్మించింది. ఈ అమ్మడికి అనూషా రంగనాథ్ అనే అక్క ఉంది, ఆమె కూడా కన్నడ చిత్రాలలో నటించి మెప్పించింది. ఆషికా ఫ్రీస్టైల్, బెల్లీ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్‌లో శిక్షణ పొందింది.
Updated on: Apr 17, 2025 | 2:07 PM

ఆషికా రంగనాథ్ ఎక్కువగా కన్నడ సినిమాల్లో నటిస్తూ పాపులర్ అయ్యింది. ఆతర్వాత తెలుగు, తమిళ చిత్రాలలో కూడా కనిపించింది. ఈముద్దుగుమ్మ 1996 ఆగస్టు 5న కర్ణాటకలోని తుమకూరులో రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు జన్మించింది.

ఈ అమ్మడికి అనూషా రంగనాథ్ అనే అక్క ఉంది, ఆమె కూడా కన్నడ చిత్రాలలో నటించి మెప్పించింది. ఆషికా ఫ్రీస్టైల్, బెల్లీ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్‌లో శిక్షణ పొందింది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో రన్నర్-అప్‌గా నిలిచింది.

ఆషికా 2016లో కన్నడ చిత్రం క్రేజీ బాయ్తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో ఈ చిన్నదాని నటనకు SIIMA అవార్డ్‌లో ఉత్తమ డెబ్యూ నటిగా నామినేషన్ లభించింది. ఆ తర్వాత రాంబో 2 (2018), రేమో, మధగజ (2021) చిత్రాలలో నటించింది. మధగజ చిత్రానికి ఆమె SIIMA ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

2023లో నందమూరి కల్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగార్జునతో నా సామిరంగ (2024)లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ప్రస్తుతం ఆషికా చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో కూడా నటిస్తోంది.

అలాగే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




